Roja : కూతురు హీరోయిన్‌గా ఎంట్రీపై మంత్రి రోజా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

NQ Staff - November 17, 2022 / 12:45 PM IST

Roja : కూతురు హీరోయిన్‌గా ఎంట్రీపై మంత్రి రోజా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Roja : సినీ నటి మంత్రి రోజా కూతురు అన్షు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతోంది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తల్లి బాటలోనే కూతురు హీరోయిన్ గా వెలుగు వెలిగే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరిగింది.

అందం విషయంలో తల్లిని మించి అన్షు ఉంటుందని కనుక హీరోయిన్ గా నటిస్తే తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కానీ రోజా కూతురుకి అసలు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టే ఆలోచన లేదట. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దర్శనం తర్వాత ఆలయం వెలుపల రోజా మీడియాతో మాట్లాడారు. స్వామి వారి దివ్య స్వరూపమును ఎన్నిసార్లు చూసినా కూడా మర్చిపోలేను అన్నట్లుగా రోజా వ్యాఖ్యానించారు.

తన కూతురు సినిమాలో అడుగు పెట్టబోతుందన్న వార్తల్లో నిజం లేదని ప్రస్తుతానికి తను చదువుకుంటుందని.. సైంటిస్ట్ అవ్వాలని కోరికతో తను కష్టపడుతోందని రోజా పేర్కొన్నారు.

ప్రస్తుతానికి సినిమాల్లో నటించే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చిన రోజా భవిష్యత్తులో ఏం జరగబోతుందో తనకు తెలియదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. రోజా కి ఒక కూతురు మరియు కొడుకు అనే విషయం తెలిసిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us