Ambati Rambabu : పవన్ నాలుగో పెళ్ళిపై సమాధానమిచ్చి అడ్డంగా బుక్కైపోయిన మంత్రి అంబటి.!
NQ Staff - October 23, 2022 / 09:06 AM IST

Ambati Rambabu : పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా.. అది రాష్ట్ర సమస్య కాదు, జాతీయ సమస్య అసలే కాదు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళకీ, జాతీయ ప్రాజెక్టు పోలవరంకీ ముడిపెట్టిన ఘనుడు మంత్రి అంబటి రాంబాబు.
జనసేన పార్టీ ‘చెప్పు’ చూపిస్తూ, మంత్రి అంబటి రాంబాబుకి ప్రశ్న సంధించింది.. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది.? అని. అంబటి రాంబాబుకి సమాధానం చెప్పడం చేతకాదు. ఈ విషయాన్ని ఆయన గతంలోనే చెప్పేశారు.
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు…
కేంద్రం నిధులు ఇవ్వాలి.. ముంపు పరిహారం సంగతి తేలాలి.. అప్పుడుగానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. కేంద్రం వేల కోట్ల రూపాయల నిధుల్ని, పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చే పరిస్థితి లేదు. అంచనాలు పెరిగిపోతోంటే, కేంద్రం మాత్రం నిధులు ఎలా ఇవ్వగలుగుతుంది.? పైగా, జాతీయ ప్రాజెక్టుని ‘మేం పూర్తి చేస్తాం..’ అంటూ గతంలో చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారాయె.
సమాధానం చెప్పలేనప్పుడు సైలెంటుగా వుండాలి తప్ప సెటైర్లేయకూడదు. వేరే విషయాలపై పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి సెటైరేయొచ్చు.. అది అంబటి రాంబాబుకి రాజకీయ హక్కుగా భావించొచ్చు. కానీ, పోలవరం ప్రాజెక్టుతో పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళిని ముడిపెట్టడమేంటి.?
పైగా, ‘నేను వేసిన సెటైరు.. నాకు చెప్పు చూపించిన జనసేన కార్యకర్తలకు మాత్రమే..’ అంటున్నారు అంబటి. చెప్పు చూపించడం సంగతి పక్కన పెడితే, ప్రశ్న సరైనదే కదా.? సంబంధిత శాఖ మంత్రి అంబటి రాంబాబు నిఖార్సయిన సమాధానం చెప్పి, చెప్పుతో కొట్టినట్లుగా జనసేనకు షాక్ ఇవ్వొచ్చు కదా.?