Ariyana Glory : చిరంజీవి, రెజీనా పాట‌కు మెహబూబ్, అరియానా అద‌ర‌గొట్టేశారుగా..!

Ariyana Glory : రీఎంట్రీ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న ఆచార్య చిత్ర షూటింగ్ పూర్తి చేయ‌గా, గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం కోసం చాలా రోజులుగా అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

Mehaboob dilse and Ariyana Glory dance for Acharya item song
Mehaboob dilse and Ariyana Glory dance for Acharya item song

సాలిడ్ కంటెంట్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెంచాయి. కొరటాల సినిమాల్లో బలమైన కథ, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీనితో ఆచార్య చిత్రంలో కొరటాల చిరంజీవిని ఎలా చూపించబోతున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

తాజాగా ఈ చిత్రం నుంచి ఇటీవ‌ల మూడవ సాంగ్ విడుదలయింది. ఇది ఐటెం నంబర్. శానా కష్టం అంటూ గమ్మత్తైన లిరిక్స్ తో సాగే ఈ పాట కొద్దిసేపటి క్రితమే విడుదలయింది. లిరికల్ వీడియో చూస్తుంటే చిరు ఫ్యాన్స్ కి, మాస్ ప్రేక్షకుల ఈ సాంగ్ థియేటర్స్ లో పండగలా ఉండబోతోంది. ఈ పాటకు భాస్కర బట్ల సాహిత్యం అందించారు. శానా కష్టం వచ్చిందే మందాకినీ.. అంటించొద్దే అందాల అగరొత్తిని అంటూ భాస్కర భట్ల గమ్మత్తైన లిరిక్స్ అందించారు.

ఈ సాంగ్ ని మంచి డాన్స్ బీట్ లా మలిచారు సంగీత దర్శకుడు మణిశర్మ. రేవంత్, గీతా మాధురిల గాత్రం ఆకట్టుకుంటోంది. వీడియోలో చిరు, రెజీనా డాన్స్ మూమెంట్స్ కూడా చూపించారు. రెజీనా కళ్ళు చెదిరేలా గ్లామర్ లుక్ లో కనిపిస్తోంది. ఇక చిరంజీవి తన సిగ్నేచర్ స్టెప్పులతో థియేటర్స్ ని మోతెక్కించేందుకు రెడీ అయ్యారు.

అయితే ఇప్పుడు ఈ పాట‌కు చాలా మంది స్టెప్పులేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహ‌బూబ్, అరియానా త‌మ‌దైన‌
స్టైల్‌లో స్టెప్పులేస్తూ నెటిజ‌న్స్ కి మంచి వినోదం పంచారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అల‌రిస్తుండ‌గా, నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు.