Megastar Chiranjeevi : మెగా లిటిల్ ప్రిన్సెస్ కు స్వాగతం.. చిరంజీవి భావోద్వేగ ట్వీట్..!

NQ Staff - June 20, 2023 / 11:33 AM IST

Megastar Chiranjeevi : మెగా లిటిల్ ప్రిన్సెస్ కు స్వాగతం.. చిరంజీవి భావోద్వేగ ట్వీట్..!

Megastar Chiranjeevi  : దాదాపు పదేండ్ల తర్వాత రామ్ చరణ్‌-ఉపాసన తల్లిదండ్రలు అయ్యారు. ఇన్నేండ్లుగా ఎదురు చూసిన మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ కల నెరవేరింది. నిన్న సాయంత్రమే ఉపాసన-రామ్ చరణ్‌ కలిసి జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ సంతోషంగా అనౌన్స్ చేసింది. ఇక రామ్ చరణ్‌, ఉపాసన దంపతులకు అంతా కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఉపాసనకు నార్మల్ డెలివరీ అయిందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మనవరాలి గురించి చిరంజీవి ట్వీట్ చేశారు. మా మెగా లిటిల్ ప్రిన్సెస్ కు స్వాగతం.

నీ రాక తో కోట్లాది మంది మెగా ఫ్యామిలీ సభ్యులలో ఆనందోత్సాహాలు నింపావు. రామ్ చరణ్‌, ఉపాసనను తల్లిదండ్రులను చేసి వారిలోనూ ఉత్సాహాన్ని పెంచావు. రామ్ చరణ్‌, ఉపాసన మాకు తాతలు గా ప్రమోషన్ ఇచ్చారు అంటూ సంతోషంగా తెలిపాడు చిరంజీవి. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ కూడా విష్ చేశాడు.

Megastar Chiranjeevi Tweeted Mega Little Princess Is Welcome

Megastar Chiranjeevi Tweeted Mega Little Princess Is Welcome

రామ్ చరణ్‌, ఉపాసనకు కంగ్రాట్స్. పేరెంట్స్ క్లబ్ కు మీకు స్వాగతం. పాపతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దేవుడు ఆమెను, మీ అందరినీ అపారమైన సంతోషంతో ఆశీర్వదించాలి అంటూ ట్వీట్ చేశాడు తారక్. ఇక మిగతా సెలబ్రిటీలు కూడా రామ్ చరణ్‌ దంపతులకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us