Megastar Chiranjeevi Sensational Comments on AP Government : పిచ్చుక లాంటి సినిమా ఇండస్ట్రీ పై బ్రహ్మాస్త్రమా? ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి కామెంట్స్..!

NQ Staff - August 8, 2023 / 12:23 PM IST

Megastar Chiranjeevi Sensational Comments on AP Government : పిచ్చుక లాంటి సినిమా ఇండస్ట్రీ పై బ్రహ్మాస్త్రమా? ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి కామెంట్స్..!

Megastar Chiranjeevi Sensational Comments on AP Government :

తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి ఎప్పటి నుంచో వాదనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో ఇప్పటికే అనేక చర్చలు జరిగాయి. సినిమా ఇండస్ట్రీ వాళ్ల బాధలు, ఇటు ప్రేక్షకుల అవసరాలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం కొంత మేర టికెట్ల రేట్లను పెంచుకునే అవకాశం కల్పించింది.

అయితే దానిపై కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో వెళ్లిన వారు కూడా జగన్ ఇచ్చిన హామీలతో సంతోషం వ్యక్తం చేశారు. అందుకే చిరంజీవి ఎప్పటికప్పుడు జగన్ తో మమేకం అవుతూనే ఉన్నారు. కానీ ఆయన తాజాగా ఏపీ ప్రభుత్వం మీద షాకింగ్ కామెంట్స్ చేశారు.

వాటి గురించి ఆలోచించండి..

అది కూడా వాల్తేరు వీరయ్య 200 రోజుల సెలబ్రేషన్స్ లో. ఇందులో ఆయన మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ గురించి కాకుండా.. ప్రత్యేక హోదా, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి హామీల గురించి ఆలోచించాలి. అంతే గానీ పిచ్చుక లాంటి సినిమా ఇండస్ట్రీపై బ్రహ్మాస్త్రం ఎందుకు అని కామెంట్స్ చేశారు.

ఆయన ఏ ఉద్దేశంలో ఇలాంటి కామెంట్స్ చేశారో అర్థం కావట్లేదు. కానీ ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి, పెద్ద సినిమాల గురించి చర్యలు తీసుకుంటూనే ఉంది. వారికి అనుకూలంగా టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాలు ఇస్తుంది. అయినా సరే చిరంజీవి ఇలాంటి కామెంట్లు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us