Megastar Chiranjeevi : మెగా వర్సెస్ గరికపాటి : ఇది చిరంజీవి సంస్కారం.. వైరల్‌ అవుతున్న వీడియో

NQ Staff - October 7, 2022 / 12:54 PM IST

Megastar Chiranjeevi  : మెగా వర్సెస్ గరికపాటి : ఇది చిరంజీవి సంస్కారం.. వైరల్‌ అవుతున్న వీడియో

Megastar Chiranjeevi  : బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన అలాయి బలాయి కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. అదే కార్యక్రమంలో గరికపాటి కూడా హాజరయ్యారు.

ఆ సందర్భంగా జరిగిన చిన్న ఇష్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గరికపాటి మాట్లాడుతున్న సమయంలో చిరంజీవితో కొందరు అభిమానులు ఫోటోలు దిగుతున్నారు, దాంతో సందడి అంతా అటు వైపు ఉన్నట్లుగా గమనించిన గరికపాటి మీ ఫోటోలు దిగడం ఆపివేస్తే నేను మాట్లాడుతాను అన్నట్లుగా చిరంజీవిపై అసహనం వ్యక్తం చేశాడు.

అయినా కూడా అక్కడ పరిస్థితి అలాగే ఉండడంతో గరికపాటి వారు అక్కడ నుండి వెళ్లి పోయేందుకు లేవడం విమర్శలకు తెరలేపింది. మెగాస్టార్ యొక్క క్రేజ్ ను ఆయన చూసి తట్టుకోలేక పోయాడు అంటూ మెగా అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

ఈ సమయంలోనే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అదేంటంటే చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో గరికపాటి వారిని ప్రస్తావించారు, తలవంచి నమస్కరించి ఇదే మిమ్మల్ని చూడడం మొదటిసారి మీ గురించి చాలా చూశాను.. మీ యొక్క ప్రవచనాలు విన్నాను.

మీకు పద్మ అవార్డు రావడం చాలా సంతోషం అనిపించింది, మిమ్ములను సమయం ఉన్నప్పుడు మా ఇంటికి ఆహ్వానిస్తాం. మీ ఆలోచన నా ఆలోచన ఒక్కటే అన్నట్లుగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు గరికపాటి వారిని గౌరవించినట్లుగా ఉన్నాయి.

అదే సమయంలో తన స్థాయిని.. తన మంచితనంను మెగాస్టార్ చిరంజీవి చాలా రెట్లు పెంచుకున్నట్లుగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇదే సమయంలో మెగా అభిమానులు ఆ వీడియో ఈ వీడియో రెండు వీడియోలను జత చేసి ఇది మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఇది ఆయన గొప్పతనం అంటూ గరికపాటి పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us