Chiranjeevi : ‘చిరంజీవి’కి 44 ఏళ్ళు.! ప్రాణం పోసిన ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.!

NQ Staff - September 22, 2022 / 11:03 PM IST

160197Chiranjeevi : ‘చిరంజీవి’కి 44 ఏళ్ళు.! ప్రాణం పోసిన ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘మీకు తెలిసిన ఈ చిరంజీవి, చిరంజీవిగా పుట్టినరోజు ఈ రోజు..’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Megastar Chiranjeevi film entry 44 years

Megastar Chiranjeevi film entry 44 years

అదేంటీ, చిరంజీవి పుట్టినరోజు ఆగస్టులో కదా.? అంటే, ఆయన నటుడిగా పుట్టినరోజు 22 సెప్టెంబర్ 1978. అదే రోజున చిరంజీవి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది. నిజానికి, ‘ప్రాణం ఖరీదు’ చిరంజీవి నటించిన రెండో సినిమా. అదే ముందుగా విడుదలైంది. మొదటి సినిమా ‘పునాదిరాళ్ళు’ అది ఆ తర్వాత విడుదలైంది.

‘ప్రాణం ఖరీదు’ ద్వారా ప్రాణం పోసి..

‘ప్రాణం ఖరీదు’ ద్వారా ప్రాణం పోసి, ప్రాణప్రదంగా, నా ఊపిరై, నా గుండె చప్పుడై, అన్నీ మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారంటూ చిరంజీవి ఒకింత ఎమోషనల్ అయినట్లే కనిపిస్తోంది. ‘నన్నింతగా ఆగరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.. ఎప్పటికీ మీ చిరంజీవి..’ అంటూ ట్వీటులో పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి.

కొణిదెల శివశంకర వరప్రసాద్, చిరంజీవిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’. ఆ సినిమా విడుదలై నేటికి నలభై నాలుగేళ్ళు. ఒక్కటి మాత్రం నిజం.. తనను ఆదరించిన ప్రేక్షకుల రుణం తీర్చుకునేందుకే ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రక్తదానం, నేతద్రానం మాత్రమే కాదు.. ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవ చేస్తున్నారు చిరంజీవి.
నిజానికి, తెలుగు నేల చిరంజీవికి రుణపడిపోయిందేమో.. అంటారు ఆయన అభిమానులు.