Megastar Chiranjeevi Praised Akira Nandan : వాడు మా అందరికంటే పెద్ద స్టార్ అవుతాడు.. అకీరాపై చిరంజీవి కామెంట్లు వైరల్..!
NQ Staff - June 26, 2023 / 11:11 AM IST

Megastar Chiranjeevi Praised Akira Nandan : మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. కాగా అందులో చాలామంది స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. నలుగురు అగ్ర హీరోలు మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నారు. చిరంజీవి కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగి చూపించాడు. కాగా ఇప్పుడు అందరి దృష్టి అకీరా నందన్ మీదనే ఉంది.
పవన్ కల్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పుకోవాలి. కాగా ఆయనకు రేణూ దేశాయ్ కు పుట్టిన అకీరా ఇప్పుడు పెద్ద వాడయ్యాడు. మల్టీ ట్యాలెంటెడ్ గా నిరూపించుకుంటున్నాడు. ఈ తరుణంలో అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని పవన్ ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవికి ఓ నెటిజన్ అకీరా గురించి ప్రశ్న వేశాడు. చిరు అభిమానులతో నిన్న రాత్రి కాసేపు చిట్ చాట్ చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. అకీరా ఎంట్రీ ఇస్తే మీ లాగా స్టార్ అవుతాడా అని అడిగాడు. దానికి చిరు స్పందిస్తూ… ఎస్.. హి ఈజ్ బికమ్ ఏ బిగ్ స్టార్ మోర్ దెన్ అవర్ హీరోస్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు చిరు.
అంటే అకీరా తమకంటే పెద్ద స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రశంసలు కురిపించాడు చిరంజీవి. దాంతో ఈ రిప్లై కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంకేముంది ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి అకీరా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.