Megastar Chiranjeevi : తమ్ముడు రవితేజని మర్చిపోయా : మెగాస్టార్ చిరంజీవి క్షమాపణ.!
NQ Staff - December 28, 2022 / 10:42 AM IST

Megastar Chiranjeevi : నిన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. అది కూడా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కోసం వేసిన భారీ సెట్లో. దాదాపుగా సినిమా కోసం పనిచేసిన ముఖ్యులందరి గురించీ చిరంజీవి తనదైన స్టయిల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కానీ, సినిమాకి అత్యంత కీలకమైన పాత్రలో నటించిన మాస్ మహరాజా రవితేజ గురించి మాట్లాడటం మర్చి పోయారు చిరంజీవి. అదెలా.? పక్కనే వున్న రవితేజ, అందునా.. తమ్ముడిలాంటి రవితేజ.. పైగా, వీరాభిమాని రవితేజని మర్చిపోవడమేంటి.?
ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొచ్చాయ్. వాటికి చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. కాదు కాదు, క్షమాపణ చెప్పేశారు.
రవితేజతో పూనకాలు లోడింగ్..

Megastar Chiranjeevi apologized to Ravi Teja
‘చిత్రంగా నా తమ్ముడు, వీరయ్యకి అతి ముఖ్యుడు రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ విషయమై వెలితిగా ఫీలయి ఈ ట్వీట్ చేస్తున్నాను..’ అంటూ ట్వీటేశారు మెగాస్టార్ చిరంజీవి.
‘ప్రాజెక్టు గురించి చెప్పగానే అన్నయ్య సినిమాలో చెయ్యాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర్నుంచి, కలిసి షూట్ చేసిన ప్రతిరోజూ రవితే మళ్ళీ ఇన్నేళ్ళకి చేయడం నాకెంతో ఆనందంగా అనిపించింది..
ఒక్క మాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోయుంటే వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా వుండేది.. పూనకాలు లోడింగ్‌లో రవితేజ పాత్ర చాలా చాలా వుంది.. ఆ విషయాలు త్వరలో మాట్లాడుకుందాం..’ అంటూ చిరంజీవి ట్వీటేశారు.
#WaltairVeerayyaPressMeet pic.twitter.com/M0dUgJvk2G
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 27, 2022