Mega154:ఈ కాంబో కుదిరితే మాస్ అభిమానులకి పూనకాలే..!
NQ Staff - November 11, 2021 / 06:54 PM IST

Mega154: కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఒక్కసారి సెట్ అయ్యాయని వార్త బయటకు వస్తే అభిమానులకి పూనకాలే వస్తుంటాయి. మెగాస్టార్ చిరంజీవి 154వ మూవీలో కీలక పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. చిరంజీవినిచూసి ఎంతో మంది అంచెలంచలుగా ఎదుగుతున్నారు.

raviteja in mega154 with chiranjeevi
చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని శ్రీకాంత్, రవితేజ్, నాని , వంటి వారు టాలీవుడ్ లో అడుగు పెట్టారు. చిన్న చిన్న పాత్రలతో సినీ జర్నీ మొదలు పెట్టి.. స్టార్ హీరోలుగా అభిమానులను అలరిస్తున్నారు. అయితే చిరంజీవి సినిమాలో మాస్ మహారాజా రవితేజ మళ్ళీ కలిసి నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

Raviteja in mega154 movie with Chiranjeevi
చిరంజీవి సైరా నరసింహా రెడ్డి తర్వాత ఆచార్య సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భోళా శంకర్ షూటింగ్ ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇప్పటికే గాడ్ ఫాదర్ షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలో బాబీ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకోనున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

raviteja in mega154 with chiranjeevi
మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ్ కూడా నటించనున్నారని టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో రవితేజ అయితే కరెక్ట్ గా సెట్ అవుతారని భావించిన బాబీ ఇప్పటికే రవితేజను సంప్రదించినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి సినిమా.. ఇక బాబీతో ఉన్న స్నేహంతో రవితేజ్ వెంటనే ఒకే అన్నాడట. ఈ విషయం త్వరలో అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించనున్నదట. ఇప్పటికే చిరంజీవి అన్నయ్య సినిమాలో రవితేజ , వెంకట్ లు తమ్ముల్లుగా నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

raviteja in mega154 with chiranjeevi
2000లో వచ్చిన అన్నయ్య మూవీలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా జిందాబాద్లో ఓ పాటలో రవితేజ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు