Mega Star Fans : మెగాస్టార్‌ ఎత్తలేక పోయాడట… ఏంట్రా బాబు ఈ రాతలు?

NQ Staff - September 30, 2022 / 01:38 PM IST

Mega Star Fans : మెగాస్టార్‌ ఎత్తలేక పోయాడట… ఏంట్రా బాబు ఈ రాతలు?

Mega Star Fans  :మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ అనే విషయం కూడా అందరికీ తెలిసిందే.

సినిమాలోని పలు సన్నివేశాలు ఉన్నది ఉన్నట్లుగా దించేశారు, సినిమా కథ యొక్క సోల్‌ మిస్ అవ్వొద్దు అనే ఉద్దేశంతో చాలా సన్నివేశాలను మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగానే తెరకెక్కించారని తెలుస్తోంది.

ఈ సమయంలోనే కొందరు

సోషల్ మీడియాలో కాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అత్యంత హీనంగా కథనం ప్రచారం చేసి తన పరువు తానే తీసుకుంది.

మెగా ఫాన్స్ సదరు చానల్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే… ఒక సన్నివేశంలో పోలీస్ ని కొట్టే షాట్‌ ఉంటుంది. అందులో మోహన్ లాల్ కాలు పైకి ఎత్తగలిగాడు.. కానీ చిరంజీవి మాత్రం కాలు ఎత్తలేక పోయాడు అంటూ ఆ ప్రముఖ మీడియా సంస్థ కథనం రాయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

చిల్లర వార్త అంటూ మెగా ఫ్యాన్స్ ఆ ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కథనాలు రాసి ఆ మీడియా సంస్థ యొక్క గౌరవం దెబ్బ తీసుకుంటుంది తప్పితే మెగాస్టార్ యొక్క స్థాయిని తగ్గించలేదు అంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us