Mega Star Chiranjeevi : మెగా ఫ్యాన్స్‌, అల్లు ఆర్మీ మధ్య గొడవలు ఇక ఆగినట్టేనా?

NQ Staff - October 1, 2022 / 04:59 PM IST

Mega Star Chiranjeevi  : మెగా ఫ్యాన్స్‌, అల్లు ఆర్మీ మధ్య గొడవలు ఇక ఆగినట్టేనా?

Mega Star  Chiranjeevi  : మెగా వర్సెస్ అల్లు. కొన్నాళ్లుగా సోషల్మీడియాలో జరుగుతున్న మేజర్ ఫ్యాన్స్‌ వార్స్ లో ఇదొకటి. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ, చిరు వర్సెస్ బన్నీ అంటూ ఇంటర్నెటల్లో ఓ రేంజ్‌లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

మెల్లి మెల్లిగా మెగా ఫ్యామిలీ ట్యాగ్

నుంచి బైటపడి తన ఓన్ ఐడెండిటీతో ముందుకెళ్లే ప్లాన్‌ లో బన్నీ ఉన్నాడంటూ ఇప్పటికే వార్తలు వినిపించాయి. టీజర్‌, ట్రైలర్, మూవీ రిలీజ్‌ టైమ్‌లో ఫ్యాన్స్‌ కూడా రెండుగా విడిపోయి మరీ యాష్‌ ట్యాగులు క్రియేట్‌ చేసుకుని సోషల్మీడియాలో కొట్టుకున్నారు. చిరు, చరణ్‌ అభిమానులకి పోటీగా అల్లు ఆర్మీ నుంచి కౌంటర్స్‌, కామెంట్స్‌ పోటీల మీద నడిచాయి. ఇంకా నడుస్తూనే ఉన్నాయి కూడా.

ఈ నేపథ్యంలో అల్లు రామలింగయ్య వందో పుట్టినరోజు సందర్భంగా అల్లు స్టూడియో లాంచ్ కి స్పెషల్ గెస్ట్ గా చిరు రావడంతో ఈ ఈవెంట్ గురించి ఈగర్ గా వెయిట్ చేశారు ఫ్యాన్స్‌. చిరంజీవి ఈ వేడుకకి అటెండయి వాళ్ల ఫ్యామిలీస్ మధ్య ఎలాంటి డిస్టబెన్స్‌ లేవనీ,

సభా ముఖంగా తెలియచేసి పుకార్లకి పుల్ స్టాప్ పెడుతూ ఫ్యాన్‌ వార్స్‌ కి ఆన్సరిస్తాడా అని ఎదురుచూశారంతా. అనుకున్నట్టుగానే ఈరోజు ఆ ప్రోగ్రామ్ కి మెగాస్టార్‌ హాజరై స్టూడియోను ప్రారంభించేశారు కూడా. తర్వాత స్పీచ్‌ లో భాగంగా అల్లు రామలింగయ్యని, ఆయన గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నాడు కూడా.

ఆయన బాటలో అల్లు అరవింద్, ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ బన్నీ, శిరీష్, బాబీ కూడా సినిమాల్లో పనిచేస్తున్నారంటూ అప్రిషియేట్ చేయడంతో పాటు అల్లు ఫ్యామిలీలో భాగమైనందుకు నాకు గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు చిరు. మరోవైపు బన్నీ కూడా స్పీచ్‌ చివర్లో మెగా ఫ్యాన్స్‌ కి థ్యాంక్స్‌ చెప్పాడు.

సో.. మొత్తంగా వీళ్ల మాటలు విన్నాక వాళ్లకెలాంటి విబేధాలు, బేషజాలు లేవనీ ఈ రోజు జరిగిన ఈవెంట్ తో మరోసారి క్లారిటీ వచ్చేసింది.

ఒకరి ఫ్యామిలీని ఒకరు రెస్పెక్ట్‌ చేసుకుంటూ, ఫ్యాన్స్‌ ని థ్యాంక్స్ చెప్తూ వాళ్ల సినిమాలు, వాళ్ల పనుల్లో వాళ్లున్నారు. కానీ సోకాల్డ్‌ ఫ్యాన్స్‌ అండ్ ఆర్మీ మెంబర్స్‌ మాత్రం ట్విట్టర్లో, సోషల్మీడియాలో, వాట్సప్‌ గ్రూపుల్లో చొక్కాలు చించేసుకుంటూ మాటలు విసురుకుంటున్నారు.

పోనీ ఒకవేళ నిజంగానే ఆ స్టార్లు, వాళ్ల కుటుంబాల్లో ఇష్యూలున్నాయా అంటే అదీ లేదు. ఒకరికొకరు ప్రేమ పంచుకుంటూ, ఫంక్షన్స్‌ కి అటెండవుతూ ఒకరి సినిమాలకొకరు ప్రమోట్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ అభిమానులు మాత్రం లేనివి ఊహించుకుని, అపోహలు కల్పించుకుని ట్రోల్స్‌, కౌంటర్స్‌ తో అక్కర్లేని హడావిడి చేస్తున్నారు.

ఈరోజు జరిగిన ఈవెంట్‌ తో అయినా ఫ్యాన్స్‌ ఈ వార్స్‌ కి పుల్ స్టాప్‌ పెట్టేసి, సినిమా చూసామా, ఎంజాయ్‌ చేశామా? అన్నట్టుగా ఉంటేనే బెటర్. అలా కాకుండా ఇలానే ఇంటర్నెట్లో రచ్చ చేస్తుంటే వాళ్ల ఫేవరేట్‌ స్టార్స్‌ మీదే బైట నెగిటివ్ ఇంప్రెషన్ పడే ప్రమాదం లేకపోలేదు.

మరి నిజమైన అభిమానులు అంత దాకా తేరు కాబట్టి… ఇప్పటికయినా సదరు ఆర్మీ మెంబర్స్‌, అండ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ ఈ సోషల్మీడియా ఫైట్స్‌ ఆపేయడం బెటర్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us