God Father : మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసిన రాములమ్మ.! గాల్లో మెలికలు తిరిగేస్తోందిగా.!

NQ Staff - September 23, 2022 / 06:51 PM IST

God Father : మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసిన రాములమ్మ.! గాల్లో మెలికలు తిరిగేస్తోందిగా.!

God Father : బుల్లితెర రాములమ్మ శ్రీ ముఖికి ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే ఇంటర్వ్యూ చేసే మెగా ఛాన్స్ కొట్టేసింది. అది కూడా గాల్లో. అదేనండీ, విమానంలో ఈ ఇంటర్వ్యూ సాగింది. ఇంకేముంది శ్రీ ముఖి ఆనందానికి అవధుల్లేవంటే అతిశయోక్తి కాదేమో.

Mega Star Chiranjeevi Sreemukhi In The Clouds With God Father Interview Promo

Mega Star Chiranjeevi Sreemukhi In The Clouds With God Father Interview Promo

అసలే అక్కడున్నది చిరంజీవి. అందులోనూ అదో రొమాంటిక్ తరహా ఇంటర్వ్యూలా సాగింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాలకు సంబంధించి అన్ని విషయాలూ ఈ ఇంటర్వ్యూలో ప్రస్థావనకొచ్చాయనుకోండి.

ముఖ్యంగా చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్ కోసమే, గాల్లో ఈ ఇంటర్వ్యూని ‘మెగా’ లెవల్లో ప్లాన్ చేశారన్న మాట.

శ్రీ ముఖికి ఆ వేషాలు కూసింత ఎక్కువే కదా..

ఇక, చిరంజీవి సెన్సాఫ్ హ్యూమర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏజ్ ఆయన విషయంలో జస్ట్ ఓ నెంబర్ మాత్రమే. చాలా సార్లు ఆ విషయం ప్రూవ్ చేశారాయన తన నటనతో. ఇక, ఇప్పుడు ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. శ్రీ ముఖితో ఇంటర్వ్యూ సందర్భంగా చిరంజీవి మరోసారి తన హ్యూమర్‌ని బయట పెట్టేశారు.

అసలే మహానటి శ్రీముఖి కదా. చిరంజీవి వేసే సెటైర్లకు గాల్లోనే తెగ మెలికలు తిరిగేసింది శ్రీ ముఖి. అన్నట్టు చిరంజీవితో ఓ సినిమాలో శ్రీ ముఖి స్పెషల్ స్టెప్పులేసింది కూడా. ఏ సినిమా అనేది తెలీదు కానీ. ఓ స్పెషల్ సాంగ్ కోసం చిరంజీవితో మాస్ స్టెప్పులు ఇరగదీసేసిందట శ్రీ ముఖి.

ఇక, ‘గాడ్ ఫాదర్’ విషయానికి వస్తే, ఈ సినిమాలో పాటలకు పెద్దగా స్కోప్ లేదు కానీ, మ్యూజిక్ మాత్రం ఇరగదీసేశాడంటూ తమన్‌ని తెగ పొగిడేశారు చిరంజీవి. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ సాంగ్ ‘తార్ మార్ టక్కర్ మార్‌..’ ఆ విషయం ప్రూవ్ అయ్యింది కూడా.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us