Mega Power Star Ram Charan Upasana : రామ్ చరణ్‌కి అబ్బాయే పుట్టాలి: సోదరి సుస్మిత
NQ Staff - January 14, 2023 / 02:44 PM IST

Mega Power Star Ram Charan Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం గర్భవతి. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి, సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ విషయం తెలిసిన క్షణం ఉద్వేగానికి గురయ్యామంటూ చిరంజీవి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.
చరణ్ – ఉపాసన చాలా కాలం క్రితమే పెళ్ళి చేసుకున్నా, కెరీర్ పరంగా ఇద్దరూ బిజీగా వుండడంతో, పిల్లల విషయమై కాస్త ‘వాయిదా’ వైపు మొగ్గు చూపారు.. అది వేరే సంగతి.
అబ్బాయే పుట్టాలి..
కాగా, చరణ్ – ఉపాసన దంపతులకు అబ్బాయే పుట్టాలంటూ తన మనసులో కోరిక బయట పెట్టారు చరణ్ సోదరి సుస్మిత. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత, చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాకీ ఆమె వర్క్ చేశారు. ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లోనే తన సోదరుడికి కొడుకు పుట్టాలని అనుకుంటున్నట్లు సుస్మిత చెప్పుకొచ్చారు.
అమ్మాయైనా, అబ్బాయైనా సంతోషమే.. ‘మా ఇంట్లో ఇప్పటికే నలుగరమ్మాయిలు వున్నారు.. సో, అబ్బాయి అయితే ఇంకాస్త స్పెషల్..’ అని చెప్పారు సుస్మిత.