Bandla Ganesh : అసలే అక్కినేని, బాలయ్య వివాదం నడుస్తుంటే అందులోకి చిరుని లాగడమేంటి బండ్లన్న? ట్వీటుతో ఘాటు కామెంట్లు దక్కించుకుంటున్న బండ్ల గణేష్.
NQ Staff - January 24, 2023 / 08:15 PM IST

Bandla Ganesh : టాలీవుడ్లో అనే కాదు.. ఏ ఇండస్ట్రీలో అయినా లెజెండరీ యాక్టర్లని కామెంట్ చేసినా, వాళ్లపై నోరు జారినా నటుల నుంచే కాదు.. కామన్ ఆడియెన్స్ నుంచి కూడా కామెంట్లు, నెగిటివ్ రియాక్షన్లు తప్పవు. ప్రస్తుతం అలాంటి పర్యవసానాలనే ఫేస్ చేస్తున్నాడు నందమూరి బాలక్రిష్ణ.
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో అక్కినేని, తొక్కినేని అంటూ బాలయ్య మాట్లాడిన మాటలు కాంటవర్సీకి సెంటర్ పాయింటుగా మారిన విషయం తెలిసిందే. ఏ ఎన్నార్ వర్థంతి మరునాడే ఓ సినిమా ఫంక్షన్ స్టేజీపైనే పబ్లిక్ గా ఇలాంటి కామెంట్స్ చేయడంతో వివాదం ఇంకాస్త రాజుకుంది.
ఇక బాలయ్య కామెంట్లకు కౌంటర్ గా.. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్. వి. రంగారావు గారు తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపర్చడం మనల్ని మనమే కించపర్చుకోవడం అంటూ అక్కినేని నాగచైతన్య, అఖిల్ తమ సోషల్మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. అయితే బండ్ల గణేష్ మాత్రం ఆ పోస్టుని షేర్ చేస్తూనే.. వుయ్ రెస్పెక్ట్ ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ అండ్ చిరంజీవి సార్ అంటూ ట్వీట్ చేశాడు. దాంతో మరో టాలీవుడ్లో మరో వివాదానికి తెరలేచినట్టయింది.
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ లాంటి మరణించిన లెజెండరీ యాక్టర్సుల సరసన చిరు పేరును చేర్చడం దేనికి? అసలు ఈ ఇష్యూలో అవసరం లేకపోయినా చిరంజీవిని ప్రస్తావించడం ఎందుకంటూ ఆ ట్వీటుకి గట్టిగానే రియాక్టవుతున్నారు ఫ్యాన్స్. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ పవన్ కళ్యాణ్ భక్తుడిలా స్పీచులు దంచడం వరకూ సరే. మరి మెగా స్టార్ ని టార్గెట్ చేస్తూ ఇలాంటి ఇర్రిలవెంట్ ట్వీట్లేంటి అంటూ నెటిజన్స్, చిరు ఫ్యాన్స్ తెగ ఫైరవుతున్నారు. లేని కాంట్రవర్సీని క్రియేట్ చేయడం తప్పితే.. ఇలాంటి ట్వీట్లు, కామెంట్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.

Mega Fans Are Outraged Over Bandla Ganesh Controversial Tweets
అయినా బండ్ల గణేష్ ఇలాంటి వివాదాస్పద ట్వీట్స్ చేయడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ కొన్ని కాంట్రవర్షియల్ ట్వీట్లు, నెగిటివ్ కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. కానీ అందరూ వ్యతిరేకిస్తుండడంతో రచ్చ అవుతున్న ఓ ఇష్యూలోకి ఇంకొకర్ని లాగి ఇష్యూని పెద్ద చేయడం ఎందుకు? అందరిలానే నార్మల్ గా రియాక్టయితే పోయేదేముంది? అంటూ కౌంటర్స్ ఫేస్ చేస్తున్నాడు బండ్ల గణేష్. మరీ నెగిటివ్ రియాక్షన్స్ చూసయినా ఆ ట్వీటుపై స్పందిస్తాడా? కాంట్రవర్సీకి కామాలు కాకుండా ఎలా పుల్ స్టాప్ పెడతాడా అనేది చూడాలి మరి.
We respect NTR,ANR , SVR & Chiranjeevi sir 🙏 https://t.co/loA301SpkR
— BANDLA GANESH. (@ganeshbandla) January 24, 2023