Meena : భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత గొప్ప నిర్ణ‌యం తీసుకున్న మీనా.. ప్ర‌శంస‌లు కురిపిస్తున్న నెటిజ‌న్స్

NQ Staff - August 14, 2022 / 12:45 PM IST

151568Meena  : భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత గొప్ప నిర్ణ‌యం తీసుకున్న మీనా.. ప్ర‌శంస‌లు కురిపిస్తున్న నెటిజ‌న్స్

Meena  : ఊపిరితిత్తుల సమస్యతో చికిత్సపొందుతూ మృతి చెందిన భర్త మరణాన్ని జీర్ణించుకుని మళ్లీ యధావిధిగా తాను ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది నటి మీనా. నటిగా కొనసాగుతూనే 2009లో విద్యాసాగర్‌ని వివాహం చేసుకుంది మీనా. సాగర్ మీనాలకు నైనిక అనే కూతురు పుట్టింది. తల్లి మీనాలాగే నైనిక కూడా విజయ్ నటించిన తేరి చిత్రంలో బాలతారగా ఎంట్రీ ఇచ్చింది.

శ‌భాష్ మీనా..

భార్యగా, తల్లిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించిన మీనా తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విభిన్న పాత్రలు పోషించింది. సాఫీగా సాగిపోతున్న సంసారంలో విషాదం నెలకొంది.. భర్త విద్యాసాగర్ మృతితో ఆమె జీవితంలో విషాదం నెలకొంది. అయితే తాజాగా ఆమె తీసుకున్న నిర్ణ‌యం పట్ల అంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Meena Decided To Donate Her Organs

Meena Decided To Donate Her Organs

హీరోయిన్ మీనా తన తదనంతరం అవయవాల ను దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా… మరణించిన తర్వాత మరి కొంత మందికి ప్రాణం పోసేలా ఉండాలనకున్నారు. ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఏదీ లేదు. ప్రాణాలు కాపాడటానికి అవయవ దానం మంచి మార్గం. దీర్ఘకాలిక అనారోగ్యాలతో పోరాటం చేస్తున్న అనేక మంది జీవితానికి రెండో అవకాశం ఇస్తుందీ అవయవ దానం.

ఎక్కువ మంది డోనర్స్ ఉండుంటే నా జీవితం మరోలా ఉండేది అని త‌న పోస్ట్‌లో పేర్కొంది మీనా. అవయవాలు దానం చేయడం ద్వారా ఒక మనిషిని బ్రతికించడమే కాదు.. వారి కుటుంబాలలో కూడా ఆనందం నింపవచ్చన్నారు మీనా. ఆమె నిర్ణ‌యంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది.