Maruthi And Prabhas: ప్రభాస్ పెద్ద తప్పు చేస్తున్నావ్.! అసలు అయ్యే పనేనా ఇది.?

NQ Staff - September 24, 2022 / 10:36 PM IST

Maruthi And Prabhas: ప్రభాస్ పెద్ద తప్పు చేస్తున్నావ్.! అసలు అయ్యే పనేనా ఇది.?

Maruthi And Prabhas: చేతిలో వున్న సినిమాల పరిస్థితేంటి.? అన్న విషయం కొంచెం కూడా ఆలోచించకుండానే ప్రభాస్ తన తదుపరి సినిమాలపై కమిట్మెంట్లు ఇచ్చేస్తున్నాడా.? ఈ విషయమై సినీ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బోల్డన్ని గాసిప్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రభాస్ ప్లానింగ్ లోపంపై విమర్శలూ వెల్లువెత్తుతున్నాయ్.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్ళాల్సి వుంది. సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభమయ్యింది. అంతే, అంతకు మించి అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్నదానిపై స్పష్టత లేదు.

చేతిలో బోల్డన్ని సినిమాలు.. డేట్స్ కుదరక పాట్లు..

‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’.. ఇలా అన్నీ ప్రతిష్టాత్మక సినిమాలే. మధ్యలో మారుతి దర్శకత్వంలో ఓ సినిమా.! ఎలా కుదురుతుందిది.? అభిమానుల ఆవేదనే ఇది. కానీ, ప్రభాస్ మాత్రం ముందడుగు వేసేశాడు, కమిట్మెంట్ ఇచ్చేశాడు.

నవంబర్‌లో మారుతి – ప్రభాస్ సినిమా సెట్స్ మీదకు వెళుతుందన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఒకవేళ అది కుదరకపోతే, ఫిబ్రవరి వరకూ ప్రభాస్‌కి తీరిక వుండదు. మరెలా మారుతి – ప్రభాస్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళేది.? పూర్తయ్యేది.?

ఏమోగానీ, ఆ సినిమా అసలెప్పటికీ సెట్స్ మీదకు వెళ్ళకూడదని ప్రభాస్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us