Manisharma : ఆచార్య ఫ్లాప్‌ బాధ్యత కొరటాలదే.. మణిశర్మ కూడా అదే మాట

NQ Staff - November 29, 2022 / 01:25 PM IST

Manisharma : ఆచార్య ఫ్లాప్‌ బాధ్యత కొరటాలదే.. మణిశర్మ కూడా అదే మాట

Manisharma : మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఫ్లాప్ పూర్తి బాధ్యత దర్శకుడు కొరటాల శివదే అంటూ మెగా కాంపౌండ్‌ ఆ మధ్య పదే పదే వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కొరటాల శివ ఎలా చెబితే అలా చేశాము అంటూ చిరంజీవి కూడా చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య తీవ్ర దుమారం రేపాయి. కొరటాల శివ వరుసగా సక్సెస్ లను దక్కించుకున్నాడు కనుక పూర్తి నమ్మకాన్ని చిరంజీవి ఉంచి ఆ సినిమాను చేశాడు.

సాదారణంగా అయితే చిరంజీవి తన యొక్క సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఆచార్య విషయంలో పూర్తిగా కొరటాల ను నమ్మేశాడు. చిరంజీవి మరియు మణిశర్మ కాంబినేషన్‌ లో వచ్చిన పలు సినిమాలు సూపర్‌ డూపర్ మ్యూజికల్‌ హిట్స్ గా నిలిచిన విషయం తెల్సిందే. కానీ ఆచార్య మాత్రం తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే.

తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో సంగీత దర్శకుడు మణిశర్మ వచ్చారు. ఆచార్య బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ గురించి ఆయన మాట్లాడాడు. గతంలో తాను చిరంజీవి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ఇచ్చాను. ఆయనకు ఎలా ఇస్తే బాగుంటుందో నాకు తెలుసు. కానీ దర్శకుడు నేను అనుకున్నది కాకుండా తాను అనుకున్నది చేయించాడు అంటూ మణిశర్మ పేర్కొన్నాడు.

మణిశర్మ మొదటి వర్షన్ ను ఆచార్య సినిమాలో ఉంచి ఉంటే తప్పకుండా మంచి టాక్ వచ్చి ఉండేది. కొరటాల శివ మొత్తం పాడు చేసి ఉంటాడు అంటూ మరోసారి మెగా ఫ్యాన్స్‌ మణిశర్మ వ్యాఖ్యల తర్వాత కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ విషయమై తీవ్రంగా చర్చ మొదలు అయ్యింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us