Manchu Vishnu : ‘జిన్నా’ సినిమాకి 80 శాతం నెగెటివ్ రివ్యూలొస్తాయ్.!
NQ Staff - October 19, 2022 / 04:58 PM IST

Manchu Vishnu : మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ‘జిన్నా’ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఉదయం 10 గంటలకే రివ్యూలు వచ్చేస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు హీరో మంచు విష్ణు.
‘నా సినిమా ఉదయం 8.45 నిమిషాలకు తొలి ప్రదర్శన ప్రారంభమవుతుంది. నో డౌట్, 10 గంటల కల్లా రివ్యూలు వచ్చేస్తాయ్. అందుకోసం కొందరు సర్వసన్నద్ధంగా వున్నారు. వాటిల్లో 80 శాతం నెగెటివ్ రివ్యూలే వస్తాయ్..’ అంటూ మంచు విష్ణు జోస్యం చెప్పడం గమనార్హం.
ప్రేక్షకులకు అన్నీ తెలుసు.. మా సినిమాని ఆదరిస్తారు..
‘మేం సినిమాని చాలా బాగా తీశాం. చాలా మంచి సినిమా ఇది.. ప్రేక్షకులకు అన్నీ తెలుసు. మంచి సినిమాని ఆదరిస్తారు.. నెగెటివ్ రివ్యూలను పట్టించుకోరు ప్రేక్షకులు..’ అని మంచు విష్ణు న్యూస్ క్యూబ్ ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
పనిగట్టుకుని కొందరు తనను ట్రోల్ చేస్తున్నారనీ, అలాంటి వారిని వదిలి పెట్టేది లేదని, ప్రస్తుతానికి ట్రోల్స్‌ని కామెడీగా భావించి ఎంజాయ్ చేస్తున్నాననీ, శృతి మించితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచు విష్ణు హెచ్చరించాడు.
సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.