Manchu Manoj : మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి ముహూర్తం ఖరారు
NQ Staff - December 17, 2022 / 04:43 PM IST

Manchu Manoj : మంచు ఫ్యామిలీకి చెందిన మనోజ్ 2019 సంవత్సరంలో ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుండి కూడా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న మంచు మనోజ్ ఆ మధ్య శోభ నాగిరెడ్డి కూతురు మౌనిక భూమా తో జంటగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
ఆమెను మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే ఆ ఫోటోలు బయటకు వచ్చి ఇన్నాళ్ళైనా కూడా ఇద్దరు పెళ్లి జరగక పోవడంతో అసలు వీరి పెళ్లి ఉందా లేదా… మీడియాలో వచ్చిన వార్తలు కేవలం పుకార్లేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎట్టకేలకు మరో సారి వీరిద్దరు కలిసి కనిపించారు. శోభా నాగిరెడ్డి జయంతి కార్యక్రమాలు మంచు మనోజ్ పాల్గొన్నారు. అదే సమయంలో కడపలోని ప్రఖ్యాత పెద్ద దర్గాను మంచు మనోజ్ సందర్శించి ప్రార్థనలు నిర్వహించారు.
ఆయన సన్నిహితులు మరియు మిత్రుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో వివాహం చేసుకునేందుకు మనోజ్ మరియు మౌనిక లు రెడీ అవుతున్నారట. వీరి కుటుంబాల పెద్దలు మరియు బంధు మిత్రుల సమక్షం లో ఫిబ్రవరి రెండో వారంలో వైభవంగా వీరి వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది.