Manchu Lakshmi : అవును.. మనోజ్ రెండో పెళ్లి విష్ణుకు ఇష్టం లేదు.. మంచు లక్ష్మీ క్లారిటీ..!
NQ Staff - June 6, 2023 / 09:41 AM IST

Manchu Lakshmi : కొన్ని రోజుల క్రితం మంచు ఫ్యామిలీ బాగా వార్తల్లో నిలిచింది. ఎందుకంటే మనోజ్ తన రెండో పెండ్లిని మౌనికతో చేసుకున్నాడు. ఆయనకు గతంలోనే పెండ్లి అయి విడాకులు కూడా అయ్యాయి. అయితే అటు మౌనికకు కూడా పెండ్లి అయి విడాకులు అయ్యాయి. ఇంకో విషయం ఏంటంటే ఆమెకు మొదటి భర్త కారణంగా ఓ కొడుకు కూడా ఉన్నాడు.
అయినా సరే మనోజ్ ఆమెను పెండ్లి చేసుకున్నాడు. పైగా ఆమె కొడుకును తన కొడుకులా చూసుకుంటానని చెబుతున్నాడు. ఈ కారణాల వల్లనే మనోజ్ పెండ్లికి అన్న విష్ణు రాలేదని అప్పట్లో రూమర్లు వచ్చాయి. మనోజ్ రెండో పెండ్లి మంచు ఫ్యామిలీలో అసలు ఎవరికీ ఇష్టం లేదని చాలా వార్తలు వచ్చాయి. మనోజ్-మౌనిక పెండ్లిలో విష్ణు ఎక్కడా కనిపించలేదు.
కానీ ఈ వార్తలపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా మంచు లక్ష్మీ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమె ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చింది. మనోజ్ పెండ్లి విష్ణుకు నిజంగానే ఇష్టం లేదా అని ఓ నెటిజన్ అడగ్గా.. ఎస్ అంటూ ఆన్సర్ ఇచ్చింది లక్ష్మీ. దాంతో ఆమె చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

Manchu Lakshmi Clarified Questions Of Netizens
అంటే మొన్నామధ్య జరిగిన గొడవ నిజమేనన్న మాట అంటూ నెటిజన్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి అన్నాదమ్ముల మధ్య జరుగుతున్న గొడవల్లో మంచులక్ష్మీ ఎటువైపు నిలబడుతుందో చూడాల్సి ఉంది. కాగా అప్పటి నుంచి మనోజ్ తో విష్ణుకు మాటలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు.