Manchi Rojulu Vachaayi: థ్రిల్లింగ్ స‌న్నివేశాల‌తో మంచి రోజులు వ‌చ్చాయి ట్రైల‌ర్‌.. !

Manchi Rojulu Vachaayi: లాక్‌డౌన్‌లో వ‌చ్చిన విరామంలో సినిమా తీసి ప్రేక్ష‌కుల ముంద‌కు తీసుకురాబోతున్నాడు ద‌ర్శ‌కుడు మారుతి. ఏక్ మినీ కథ” చిత్రంతో మంచి హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్, గ్లామ‌ర్ బ్యూటీ మెహ్రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సినిమా తెర‌కెక్కించాడు.

Manchi Rojulu Vachaayi Movie Teaser Launched
Manchi Rojulu Vachaayi Movie Teaser Launched

యువి కనెక్ట్స్ బ్యానర్ లో ఎస్.కె.ఎన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు.కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు సంతోష్ శోభన్. చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ని చూస్తుంటే మళ్ళీ మారుతి తన అసలైన మార్క్ చూపించినట్టు అనిపిస్తుంది.

ఈ సినిమాలో రొమాన్స్ అధికంగానే ఉండ‌నున్న‌ట్టు ట్రైల‌ర్ చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయం అని తెలుస్తుంది. సంతోష్ మరియు మెహ్రీన్ ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కనిపిస్తుంది. అలానే మారుతీ మార్క్ కామెడీతో ట్రైలర్ అయితే ఫన్ ఫిల్డ్ గా అనిపిస్తుంది. నవంబర్ 4న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

సాయి ధరం తేజ్ తో ప్రతిరోజూ పండుగే సినిమాతో హిట్ అందుకున్న మారుతి ఆ తర్వాత రెండు సినిమాలతో వస్తున్నాడు. అందులో ఒకటి గోపీచంద్ తో చేస్తున్న పక్కా కమర్షియల్ కాగా.. మరోటి సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న మంచి రోజులు వచ్చాయ్. కెరియర్ మొదట్లో కొద్దిగా అడల్ట్ డోస్ ఎక్కువ ఉన్న సినిమాలు చేసిన మారుతి భలే భలే మగాడివోయ్ సినిమా నుండి పూర్తిగా తన పంథా మార్చాడు. ఇప్పుడు మారుతి సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసే సినిమాగా ఉంటున్నాయి.