Pavitra Lokesh : నటి పవిత్ర లోకేష్ క్యారెక్టర్ మరీ అంత ‘బ్యాడ్’గానా.?
NQ Staff - July 1, 2022 / 03:57 PM IST

Pavitra Lokesh : సినీ నటి పవిత్ర లోకేష్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. సీనియర్ నటుడు నరేష్‌ని ఆమె ఇటీవల పెళ్ళి చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. నరేష్‌కి ఇంతకు ముందు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి. పవిత్ర లోకేష్ ఆయనకు నాలుగో భార్య అని చెబుతున్నారు. ఇంకోపక్క పవిత్ర లోకేష్‌కి కూడా ఇది నాలుగో పెళ్ళి అట.!
ఇంతకీ, ఈ ప్రచారంలో వాస్తవం ఎంత.? ఏమోగానీ, పవిత్ర లోకేష్ భర్తనంటూ సుచేంద్ర అనే ఓ వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు. పవిత్రతో తనది మొదట్లో అన్యోన్య దాంపత్యమేననీ, అయితే ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమె మనస్తత్వంలో మార్పు వచ్చిందనీ, తనను వదిలేసి వెళ్ళిపోయిందని సుచేంద్ర ఆరోపిస్తున్నారు.

Man named Suchendra Forward Media as Pavitra Lokesh Husband
పవిత్ర లోకేష్‌కి చాలామందితో అక్రమ సంబంధాలు.!
‘నాతో కాపురం చేస్తూనే చాలామందితో ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకుంది..’ అని సుచేంద్ర ఆరోపిస్తున్నాడు. సీనియర్ నటుడు నరేష్‌ని పవిత్ర పెళ్ళి చేసుకున్నా, అతనితో ఎక్కువ కావాలం వైవాహిక బంధాన్ని కొనసాగించబోదనీ, ఆస్తిని లాగేసుకుని అతనికి దూరమవుతుందని సుచేంద్ర చెప్పుకొచ్చాడు.
కాగా, ఇంతవరకు పవిత్ర లోకేష్ – నరేష్ పెళ్ళి గురించి అధికారిక ప్రకటన ఏదీ బయటకు రాలేదు. అయితే, తామిద్దరం సహజీవనం చేస్తున్నట్లు పవిత్ర చెప్పిందంటూ, ఓ స్టింగ్ ఆపరేషన్ సమాచారమైతే ప్రచారంలో వుంది.
పవిత్ర లోకేష్ తెలుగుతోపాటు, పలు ఇతర భాషల్లోనూ చాలా సినిమాలు చేసింది. టీవీ సీరియళ్ళలోనూ నటిస్తోందామె.