Malaika Arora : బ్రేక‌ప్ దిశ‌గా మ‌రో జంట‌.. అవాక్క‌వుతున్న అభిమానులు..!

Malaika Arora : ఇటీవ‌ల కొన్ని బ్రేక‌ప్స్ అభిమానుల‌ని ఎంత‌గానో బాధిస్తున్నాయి. స‌మంత‌- నాగ చైత‌న్య విడాకుల త‌ర్వాత ష‌ణ్ముఖ్‌- దీప్తి జంట బ్రేక‌ప్ చెప్పుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సిరి- శ్రీహాన్ కూడా త్వ‌ర‌లో విడిపోతార‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. ఇక మ‌రో జంట కూడా విడిపోయింద‌నే ప్రచారం బీటౌన్‌లో జోరుగా న‌డుస్తుంది. ఇన్నాళ్లు చాలా అన్యోన్యంగా ఉన్న మలైకా అరోరా.. అర్జున్ కపూర్ జంట విడిపోయిన‌ట్టు తెలుస్తుంది.

Malaika Arora and Arjun Kapoor going to break up
Malaika Arora and Arjun Kapoor going to break up

మ‌లైకా- అర్జున్ ..ఈ ఇద్ద‌రికి భారీగా ఏజ్ గ్యాప్ ఉండడం.. ఆమెకు అంతకు ముందే పెళ్లవడం వంటి వాటి వల్ల ఈ జోడీ హైలైట్ అవుతోంది. మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలో కొన్ని చిత్రాల్లో నటించింది మలైకా అరోరా. నటిగా గుర్తింపును అందుకోలేని ఈ బ్యూటీ.. ‘ఛయ్య ఛయ్య..’, ‘అనార్కలీ డిస్కో ఛాలీ’, ‘మున్నీ బద్నామ్‌ హుయే’ వంటి స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయింది. తెలుగులో ‘అతిథి’, ‘గబ్బర్ సింగ్‌’లో ఐటెం సాంగ్స్ చేసింది.

ఇక, బోనీ కపూర్ కుమారుడిగా పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అర్జున్ కపూర్. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను అందుకుంటూ బాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతూ సత్తా చాటుతున్నాడు. వీరిద్ద‌రు కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉంటూ తెగ ర‌చ్చ చేస్తూ వ‌చ్చారు.

గ‌త సంవత్సరం జనవరి 1 న, మలైకా అరోరా అర్జున్ కపూర్‌తో తన సంబంధాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అందరి ముందు అధికారికంగా ప్రకటించింది. అర్జున్ కపూర్ గతంలో రియా కపూర్ ఇంటికి డిన్నర్ కోసం వెళ్లాడు. రియా ఇల్లు మలైకా ఇంటికి చాలా దగ్గరగా ఉంది, అయినప్పటికీ అర్జున్ కపూర్ అక్కడికి వెళ్ళ లేదు. మలైకా ఇంతకు ముందు అర్జున్ కపూర్‌తో కలిసి ఫ్యామిలీ డిన్నర్‌కి వెళ్లేది, కానీ ఇప్పుడు అర్జున్ కుటుంబంతో ఒంటరిగా గడుపుతున్నాడు.

కొంత కాలంగా ఈ జంట డిన్నర్, కాఫీ డేట్‌లకు వెళ్లడం మానేశారు. అర్జున్, మలైకా మధ్య దూరం చూస్తుంటే ఇద్దరూ విడిపోయినట్లు అనిపిస్తుందని అంటున్నారు. నిజానికి మలైకా సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకుంది. ఆ తరువాత అతనికి విడాకులు ఇచ్చి అర్జున్ కపూర్ తో డేటింగ్ మొదలు పెట్టింది.