Baba Movie : ‘బాబా’ రీ రిలీజ్.! డబ్బింగ్ పూర్తి చేసిన రజనీకాంత్.!
NQ Staff - November 28, 2022 / 01:47 PM IST

Baba Movie : అదేంటీ.? ‘బాబా’ సినిమా అంటే అప్పుడెప్పుడో వచ్చేసిన రజనీకాంత్ సినిమా కదా. ఆ సినిమాకి ఇప్పుడు డబ్బింగ్ పూర్తి చేయడమేంటీ.? అనుకుంటున్నారా.? అవునండీ. పాత సినిమానే.రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.
అకేషనల్‌గా కొన్ని తెలుగు సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కి సరికొత్త మజా ఇస్తున్నారు స్టార్ హీరోలు. అలాగే రీ రిలీజ్ మూవీస్ అయినప్పటికీ బాగానే క్యాష్ చేసుకుంటున్నారు ఆయా సినిమాలతో నిర్మాతలు.
ఎక్స్‌ట్రా లెవల్‌లో స్పెషల్ కిక్ ఇస్తానంటోన్న ‘బాబా’
ఇక, సూపర్ స్టార్ రజనీకాంత్, అందాల భామ మనీషా కోయిరాల జంటగా నటించిన ‘బాబా’ సినిమా అప్పట్లో పెద్దగా సక్సెస్ కాలేదు. భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. కానీ, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిందీ సినిమా.
తాజాగా ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్లు. అయితే, ఎలా వున్న సినిమాని అలాగే రిలీజ్ చేయకుండా, కొన్ని కొత్త సీన్లు యాడ్ చేస్తున్నారట. ఆ సన్నివేశాలకు సూపర్ స్టార్ తానే డబ్బింగ్ చెప్పుకున్నారట.
ఆసక్తికరంగా తెరకెక్కించిన ఈ సినిమాలతో ‘బాబా’, తాజాగా ఎలాంటి సంచలనాలు నమోదు చేయనుందో చూడాలి మరి.