Major Movie : అడివి శేష్ ‘మేజర్’ ఓటీటీలోకి వచ్చేస్తోందహో.!
NQ Staff - June 30, 2022 / 07:55 PM IST

Major Movie : ఇప్పుడప్పుడే ఓటీటీలోకి ‘మేజర్’ సినిమా వచ్చే అవకాశమే లేదంటూ పదే పదే చెబుతున్నాడు హీరో అడివి శేష్. సూపర్ స్టార్ మహేష్‌బాబు నిర్మించిన ఈ ‘మేజర్’, ముంబైపై పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు జరిపిన దాడి, ఈ క్రమంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కాగా, సినిమాని 50 రోజుల తర్వాతే ఓటీటీలో చేసే దిశగా అప్పట్లో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రచారం జరిగింది. ‘మేజర్’ థియేటర్లలో మాత్రమే చూడాల్సిన సినిమా.. అంటూ అడివి శేష్ పదే పదే చెబుతున్నాడు.
నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేస్తోంది.. ఎందుకిలా.?

Major Movie Netflix Announced on July3rd
అయితే, సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటలీలోకి వచ్చేస్తోంది. జులై 3న ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించడం గమనార్హం. దాంతో, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్, నిర్మాతల మాటల్ని లెక్క చేయడంలేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
నిజానికి, ‘మేజర్’ థియేట్రికల్ రన్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. అయినాగానీ, సినిమా కోసం అడివి శేష్ చెయ్యాల్సినదానికంటే ఎక్కువ చేస్తున్నాడు ప్రమోషన్ల పరంగా. విద్యార్థులు బల్క్‌గా బుక్ చేసుకుంటే, 50 శాతం రాయితీ.. అంటూ టిక్కెట్ల ధరల విషయమై ప్రకటన కూడా చేశాడు.
ఇంతలోనే, ఓటీటీ ప్రకటన వచ్చేసింది.