Mahesh Babu : అభిమానుల ఆవేదన: నమ్మకాలు పోయాయ్ మహేషూ.!
NQ Staff - December 9, 2022 / 12:10 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజా సినిమా షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. కుటుంబంలో వరుస విషాదాల నేపథ్యంలో మహేష్ ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే వున్నాడన్నది కాదనలేని వాస్తవం.
మరి, ఈ మధ్యనే ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు కదా.? అంటే, యాడ్ షూట్ వేరు.. సినిమా షూటింగ్ వేరు. కొన్నాళ్ళ క్రితం త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ప్రారంభమయ్యింది. షూటింగ్ షురూ అయ్యింది.. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా షూటింగ్ విషయమై గందరగోళం ఏర్పడింది.
డిసెంబర్ 16 నుంచి అంటున్నారు గానీ..
డిసెంబర్ మొదటి వారం నుంచి మహేష్ – త్రివిక్రమ్ సినిమా మళ్ళీ పట్టాలెక్కుతుందన్న ప్రచారం జరిగింది. అది కాస్తా ఇప్పుడు డిసెంబర్ 16 నుంచి అంటున్నారు. కానీ, అభిమానులేమో ‘మాకు నమ్మకాల్లేవ్ మహేసూ..’ అంటూ తెగేసి చెబుతున్నారు సోషల్ మీడియా వేదికగా.
కథ విషయమై కొంత గందరగోళం వుందనీ, ఆ కారణంగానే సినిమా ముందుకు కదలడంలేదన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో నిజమెంతోగానీ, కుటుంబంలో నెలకొన్న వరుస విషాదాల నేపథ్యంలో మహేష్‌ని అభిమానులూ ఒకింత అర్థం చేసుకోవాల్సి వుంటుంది.!