Parashuram : ముగ్గురు హీరోల‌తో మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్ చేస్తున్న మ‌హేష్ డైరెక్ట‌ర్

Parashuram : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా ప్ర‌స్తుతం ప‌ర‌శురాం స‌ర్కారు వారి పాట అనే చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ‌ల‌న ఈ చిత్రం వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. సామాజిక అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలు – ఆర్థిక నేరగాళ్ల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్.

mahesh babu Sarkaru vaari pata director Parashuram going to do a big movie with three heros 1
mahesh babu Sarkaru vaari pata director Parashuram going to do a big movie with three heros 1

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మహేష్ ను ‘పోకిరి’ తరహా వింటేజ్ లుక్ లో చూపించి అభిమానుల మన్ననలు అందుకున్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేశారు.

సమ్మర్ కానుకగా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే పరశురామ్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి సినిమా ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాని మ‌ల్టీ స్టార‌ర్‌గా తెర‌కెక్కించ‌నున్నార‌నే టాక్ వినిపిస్తుంది.

‘యువత’ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయయ్యాడు పరశురామ్ పెట్లా. ఈ క్రమంలో ‘ఆంజనేయులు’ చిత్రంతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న పరశురామ్.. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఇక ‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని టాప్ లీగ్ లో చేశారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు.

ఇప్పుడు పరశురాం మూడు మేల్ లీడ్ రోల్స్ తో స్టోరీ రెడీ చేసారని చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఏ హీరోలు నటిస్తారో చూడాలి. ఇకపోతే అక్కినేని నాగచైతన్యతో పరశురామ్ ఓ మూవీ బాకీ ఉన్నారు. ‘సర్కారు వారి పాట’ కంటే ముందుగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో చైతూతో ఓ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తుందనగా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం రావడంతో ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారు