Pushpa Movie : పుష్ప సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. బ్యాడ్ లక్..!

NQ Staff - June 6, 2023 / 01:25 PM IST

Pushpa Movie : పుష్ప సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. బ్యాడ్ లక్..!

Pushpa Movie : సినిమా రంగంలో కొన్ని సార్లు చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ఫలితాలను మూటగట్టుతాయి. చివరకు కొన్ని మంచి చేస్తే ఇంకొన్ని తీవ్ర నష్టాలను మిగులుస్తాయి. కొందరు హీరోలు తమకు వచ్చిన కథలను విని ఏదో నచ్చక రిజెక్ట్ చేస్తారు. చివరకు అదే కథతో వేరే హీరోలు సినిమాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ మూవీ హిట్ అయితే రిజెక్ట్ చేసిన హీరో బాధపడాల్సి వస్తుంది.

ఇప్పుడు ఓ స్టార్ హీరో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎందుకంటే ఆయన ఏకంగా పాన్ ఇండియా సినిమా పుష్పను కాదనుకున్నాడు. ఈ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతోనే బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దెబ్బకు ఆయన క్రేజ్ డబుల్ అయిపోయింది.

అయితే ఈ సినిమాను సుకుమార్ ముందుగా మహేశ్ బాబును ఊహించుకుని రాసుకున్నాడంట. ఆయన అయితేనే ఈ మూవీకి సెట్ అవుతారని భావించారంట. కానీ అంత మాస్ లుక్, గడ్డం తనకు సెట్ కాదని మహేశ్ బాబు సున్నితంగా రిజెక్ట్ చేశాడు. దాంతో ఈ సినిమా కథను అల్లు అర్జున్ కు వినిపించాడు.

Mahesh Babu Rejected Pushpa Movie

Mahesh Babu Rejected Pushpa Movie

కథ, సుకుమార్ మేకింగ్ విన్న బన్నీ ఓకే చెప్పాడు. కాకపోతే కొన్ని మార్పులు చేయాలని కోరాడు. దాంతో సుకుమార్ కూడా మరిన్ని మార్పులు చేసి కథను మలిచాడు. ఈ సినిమా బన్నీ ఊహించినట్టే పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us