Mahesh Babu : బాబోయ్‌ మహేష్‌.. ఏంటీ భయ్యా ఈ వర్కౌట్స్‌?

NQ Staff - November 10, 2022 / 11:06 AM IST

Mahesh Babu : బాబోయ్‌ మహేష్‌.. ఏంటీ భయ్యా ఈ వర్కౌట్స్‌?

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదు పదుల వయసుకు దగ్గరకు వచ్చాడు. ఈ సమయంలో కూడా ఆయన మూడు పదుల వయసు యంగ్ హీరో అన్నట్లుగానే కనిపిస్తున్నాడు. ఆయన ఫిట్నెస్ మరియు ఫిజిక్ రహస్యం ఏంటి అంటే ఎక్కువ సమయం జిమ్ లో గడపడమే అంటూ ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు.

ఆయన ఇంట్లో పర్సనల్ జిమ్ ఉంటుంది, అత్యాధునిక పరికరాలు అక్కడ ఉంటాయి. అంతే కాకుండా ట్రైనర్ కూడా ఆయనకు ఎప్పుడూ తోడు ఉంటాడు. అందుకే రెగ్యులర్ గా జిమ్ చేయడంతో పాటు సాధ్యమైనంత వరకు ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం వల్లే మహేష్ బాబు ఇంత యంగ్ గా మరియు అందంగా ఉంటాడు అంటూ ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు.

పలు సందర్భాల్లో మహేష్ బాబు కూడా తన ఫిట్ నెస్ రహస్యం జిమ్‌ చేయడం అంటూ కూడా తెలియజేశాడు. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో కష్టపడి మహేష్ బాబు వర్కౌట్ చేస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు.

ఈ యాంగిల్ లో చూస్తూ ఉంటే ఈయన మహేష్ బాబునా లేదంటే ఆయన తనయుడు గౌతమ్ కృష్ణ నా అనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా ఇంతగా వర్కౌట్ చేసే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం మహేష్ బాబు మాత్రమే అయి ఉంటుంది అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు.. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఇప్పటికే ఒకే చెప్పాడు. వచ్చే సంవత్సరంలో రాజమౌళి దర్శకత్వం లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us