Mahesh Babu : ఇందిరా దేవి మరణం ఇంట్లోనా? హాస్పిటల్‌ లోనా? చివరి రోజులు ఎలా గడిచాయి!

NQ Staff - September 28, 2022 / 08:54 AM IST

Mahesh Babu : ఇందిరా దేవి మరణం ఇంట్లోనా? హాస్పిటల్‌ లోనా? చివరి రోజులు ఎలా గడిచాయి!

Mahesh Babu : బుధవారం ఉదయాన్నే మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసిన ఇందిరా దేవి మరణ వార్త టాలీవుడ్ ని దుఃఖంలో ముంచేసింది. ఆమె మరణం గురించి అప్పుడే సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. హాస్పిటల్ లో ఇందిరా దేవి మృతి చెందారంటూ కొందరు ప్రచారం చేస్తుండగా మరి కొందరు ఆమె ఇంట్లోనే మృతి చెందారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు.

అసలు ఇందిరా దేవి ఎక్కడ మృతి చెందారు అనే విషయమై కుటుంబ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇందిరా దేవి గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం మరీ విషమించింది. దాంతో హైదరాబాదులోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించడం కోసం జాయిన్ చేశారు.

అక్కడ కొన్ని రోజుల పాటు ఆమె చికిత్స పొందారు. నాలుగు రోజుల క్రితం ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆమె పరిస్థితి కష్టంగానే ఉందని వైద్యులు అన్నారట. దాంతో ఆమె కుటుంబ సభ్యులు గత నాలుగు రోజులుగా పూర్తిగా ఆమెకు సమయం కేటాయించి ఆమెతోనే ఉన్నారట.

ఇందిరా దేవి కి ధైర్యం కల్పించేలా ఆమెకు కుటుంబ సభ్యులు తోడుగా నిలిచారు. అయినా కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదు. కుటుంబ సభ్యులు చుట్టూ ఉండగా ఆమె మృతి చెందారు. పద్మాలయ స్టూడియోలోని ఇంట్లోనే ఆమె మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us