Mahesh Babu And Namrata : టీఆర్‌ఎస్ ఆఫీస్ పక్కన మహేష్ బాబు హోటల్ బిజినెస్!
NQ Staff - October 28, 2022 / 03:44 PM IST

Mahesh Babu And Namrata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గానే కాకుండా పదుల సంఖ్యలో సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తన సొంత కంపెనీలను కూడా ఏర్పాటు చేశాడు.
ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్ లో రాణిస్తున్న మహేష్ బాబు తాజాగా ఏషియన్ సంస్థతో కలిసి ఏసియన్ నమ్రత హోటల్స్ ని ప్రారంభించబోతున్నారు. హైదరాబాదులో మొదటగా బంజారాహిల్స్ లోని టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కన ఏసియన్ నమ్రత హోటల్ ని భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుందట.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్నాయి హోటల్లో అత్యంత ఎక్కువ పార్కింగ్ ప్లేస్ ఉంటుందని చెప్తున్నారు. హైదరాబాదులోని అన్ని హోటల్స్ లో పార్కింగ్ సమస్య చాలా పెద్దదిగా ఉంది.
అందుకే మహేష్ బాబు హోటల్స్ కి ఆ సమస్య లేకుండా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం వర్క్ జరుగుతుండగా అతి త్వరలోనే ప్రారంభం అవుతుందని చెప్తున్నారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ను మహేష్ బాబు చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే సంవత్సరంలో విడుదల కాబోతుంది. మహేష్ బాబు సినిమాల నుండి వ్యాపారం అన్ని వ్యవహారాలను నమ్రత చూసుకుంటుంది. ఇప్పుడు హోటల్ బిజినెస్ ని కూడా నమ్రత చూసుకోబోతున్నారు.