Mahesh Babu Guntur Karam New Poster Release : లుంగీ కట్టుకుని.. చేతిలో సిగరెట్ తో.. మహేశ్ లుక్ అదిరిందిగా..!

NQ Staff - August 9, 2023 / 09:36 AM IST

Mahesh Babu Guntur Karam New Poster Release : లుంగీ కట్టుకుని.. చేతిలో సిగరెట్ తో.. మహేశ్ లుక్ అదిరిందిగా..!

Mahesh Babu Guntur Karam New Poster Release :

మహేశ్ బాబు సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. ఇక తాజాగా ఆయన నటిస్తున్న మూవీ గుంటూరు కారం. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ విషయంలో మొదటి నుంచి ఫ్యాన్స్ కు నిరాశే మిగులుతోంది.

ఎందుకంటే మూవీ షూటింగ్ ఆలస్యం కావడం, హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ ఇలా చాలామంది తప్పుకోవడం చూస్తున్నాం. దాంతో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్ అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఊర మాస్ లుక్..

Mahesh Babu Guntur Karam New Poster Release

Mahesh Babu Guntur Karam New Poster Release

ఇందులో ఓ ఆఫీస్ టేబుల్ పై కూర్చుని సిగరేట్‌ వెలిగించుకుంటున్నట్టుగా ఉన్న మహేష్‌ కొత్త లుక్‌ అదిరిపోయింది. ఊర మాస్‌గా ఉంది. పైగా ఇందులో ఆయన లుంగీ కట్టుకుని కనిపిస్తున్నాడు. ఇంకేముంది ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ అందించారంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. పైగా మాస్ లుక్ లో స్టైలిష్‌ గ్లాసెస్ పెట్టుకోవడం విశేషం.

దాంతో మూవీ షూటింగ్ నడుస్తోందనే క్లారిటీని ఇలా ఇచ్చేశారు. దాంతో పాటు మూవీ రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫర్మ్ చేసేసింది మూవీ టీమ్. వచ్చే జనవరి 12న మూవీ రిలీజ్ కాబోతోంది. షూటింగ్ వాయిదాలు పడుతుండటంతో రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే అనుమానాలు వచ్చాయి. కానీ అదేం లేదని మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us