Ramesh Babu : ర‌మేష్ బాబు భార్య ఎవ‌రు.. ఆయ‌న‌కు ఎంత మంది పిల్ల‌లో తెలుసా?

Ramesh Babu : సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస విషాదాలు అభిమానుల‌ని ఎంత‌గానో క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. ఒక‌రి మ‌ర‌ణాన్ని మ‌ర‌చిపోక ముందే మ‌రో సెల‌బ్రిటీ క‌న్నుమూస్తున్నారు. నిన్న రాత్రి సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు సోదరుడు.. ఒకనాటి హీరో రమేష్ బాబు (56) కన్నుమూశారు. ఈ వార్త ఘట్టమనేని అభిమానుల్ని షాక్ కు గురిచేస్తోంది.

Mahesh babu brother Ramesh Babu wife and family
Mahesh babu brother Ramesh Babu wife and family

కాలేయ సంబంధిత వ్యాధిలో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనని కుటుంబ సభ్యులు హుటా హుటిన గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే రమేష్ బాబు మృతిచెందినట్టు డాక్టర్లు దృవీకరించారు. రమేష్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Mahesh babu brother Ramesh Babu wife and family
Mahesh babu brother Ramesh Babu wife and family

కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన రమేష్ బాబు హీరోగా నిలబడలేక పోయారు. తరువాత ప్రోడ్యూసర్ గా మారి మహేష్ బాబుతో కొన్ని సినిమాలు నిర్మించారు. ర‌మేష్ బాబు ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి చూస్తే.. సూపర్ స్టార్ కృష్ణ -ఇందిరా దేవి ఐదుగురు సంతానంలో రమేష్ బాబు పెద్దవాడు. ఆయన తరువాత మంజుల, పద్మావతి, మహేష్ బాబు, ప్రియదర్శిని ఉన్నారు.

మహేష్ బాబు కంటే ముందే అల్లూరి సీతారామరాజు సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు. ఇటీవ‌లి కాలంలో రమేష్ బాబు, ఆయ‌న‌ ఫ్యామిలీ మాత్రం ఎక్కువగా బయట కనిపించలేదు. రమేష్ బాబు భర్య పేరు మృదుల, వీరికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు భారతి, అబ్బాయి పేరు జయకృష్ణ, వీరు ఎక్కువగా మీడియా ముందుకు రారు. ఘట్టమనేని ప్యామిలీ ఫంక్షన్స్ తో కూడా వీరు కనిపించింది తక్కువే.

ర‌మేష్ సినిమాలకు దూరం అయిన తరువాత బాగా వ్యసనాలకు అలవాటు పడిపోయినట్టు సమాచారం. అందకే ఆయన కూడా ఎక్కువగా బయట కనిపించలేదు. ఎప్పుడో ఆయన కుమారుడు జయ కృష్ణ ధోతీ ఫంక్షన్ లో తప్పించి.. రమేష్ బాబు బయటకు వచ్చిన సందర్భాలు లేవు.