Mahesh Babu : ఘట్టమనేని రమేష్ తనయుడు.. హీరోలా వున్నాడు.!

NQ Staff - November 18, 2022 / 08:17 AM IST

Mahesh Babu : ఘట్టమనేని రమేష్ తనయుడు.. హీరోలా వున్నాడు.!

Mahesh Babu : శోక సంద్రంలో వుందిప్పుడు సినీ నటుడు మహేష్‌బాబు కుటుంబం. ఆయన కొన్నాళ్ళ క్రితమే సోదరుడ్ని కోల్పోయాడు. ఆ తర్వాత తల్లిని కోల్పోయాడు. ఇప్పుడేమో తండ్రిని కోల్పోయాడు. రమేష్‌బాబు, ఇందిరాదేవి, కృష్ణ.. ఇలా వరుసగా ముగ్గురు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడంతో మహేష్ తీవ్రమైన విచారంలో వున్నాడు.

కాగా, నిన్న సూపర్ స్టార్ కృష్ణ పార్దీవ దేహానికి అంత్యక్రియులు జరగ్గా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు కృష్ణ చిత్ర పటానికి ప్రత్యేకంగా నివాళి అర్పించారు. విదేశాల నుంచి దివంగత ఘట్టమనేని రమేష్‌బాబు తనయుడు హైద్రాబాద్ చేరుకున్నాడు.

నటనలో శిక్షణ పొందుతున్నాడట..

రమేష్‌బాబు తనయుడు విదేశాల్లో నటనలో శిక్షణ పొందుతున్నాడట. రమేష్‌బాబుకి ఓ కుమార్తె కూడా వుంది. అన్న రమేష్‌బాబు కుటుంబాన్ని సైతం ఓదార్చాల్సిన బాధ్యత మహేష్‌బాబు మీదనే వుంది. బాబాయ్‌ని చూసి రమేష్ తనయుడు, తనయ ఎమోషనల్ అయ్యారట.

పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, రమేష్ తనయుడి ఫొటోలు బయటకు రావడంతో, హీరోలా వున్నాడనీ.. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరపైకి రాబోతున్నాడనీ ఘట్టమనేని అభిమానులు అనుకుంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us