Mahesh Babu : నాన్న ఇచ్చిన పెద్ద ఆస్తి మీరు : మహేష్ బాబు
NQ Staff - November 27, 2022 / 08:43 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ నేడు హైదరాబాద్లోని జేఆర్సి ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించారు. కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అంతే కాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మరియు మీడియా రంగానికి చెందిన వ్యక్తులు ఇంకా వివిధ రంగాలకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి కృష్ణ గారితో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తనకు తండ్రి కృష్ణ ఎన్నో ఇచ్చారు, అందులో అత్యంత విలువైనది మీ అభిమానం. మీ అభిమానం నాకు నాన్న ఇచ్చిన పెద్ద ఆస్తి.
మీలాంటి అభిమానులను ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నా గుండెల్లో మీ గుండెల్లో ఎప్పటికీ చిర స్థాయిగా ఉంటారు అంటూ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.