Mahesh Babu : తండ్రి కార్యం కోసం విజయవాడ చేరుకున్న మహేష్ బాబు
NQ Staff - November 21, 2022 / 03:14 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందడంతో చిన్న కుమారుడు మహేష్ బాబు అన్ని కార్యక్రమాలు నిర్వహించారు.
అంత్య క్రియలు మొదలుకుని నేడు హస్తికలు కృష్ణానదిలో కలపడం వరకు అన్నీ కూడా మహేష్ బాబు దగ్గరుండి చేశారు. కొడుకుగా తన బాధ్యతలను ప్రతి ఒక్కటి హిందూ ధర్మం ప్రకారం నిర్వహించిన మహేష్ బాబు నేడు విజయవాడలో కృష్ణానది ఒడ్డున సందడి చేశారు.
తండ్రి కృష్ణ యొక్క హస్తికలను నిమజ్జనం చేసేందుకు హైదరాబాద్ నుండి విజయవాడ చేరుకున్న మహేష్ బాబు అక్కడ వేద మంత్రాల సమక్షంలో కృష్ణ యొక్క హస్తికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు పక్కన దర్శకుడు త్రివిక్రమ్ మరియు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మహేష్ బాబు విజయవాడ వచ్చాడని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున కృష్ణ నది ఒడ్డకు చేరుకున్నారు. కృష్ణ యొక్క కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో మరో వారం లేదా రెండు వారాల్లో త్రివిక్రమ్ యొక్క సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి.