Mahabharat Project New Update : మహేష్ తో పూర్తికాగానే ‘మహాభారతం’.. కన్ఫర్మ్ చేసిన విజయేంద్ర ప్రసాద్..!
NQ Staff - July 10, 2023 / 08:03 PM IST

Mahabharat Project New Update :
మన టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా దగ్గర టాప్ డైరెక్టర్ల లిస్టులో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు.. ఈయన తన కెరీర్ లో కేవలం కొన్ని సినిమాలే చేసిన ఆ సినిమాలతోనే అగ్ర డైరెక్టర్ గా ఎదిగాడు.. ఇక గత రెండు సినిమాల నుండి ఈయన క్రేజ్ ఇండియా దాటి ప్రపంచ వ్యాప్తంగా కూడా పాకింది..
తన విజన్ తో జక్కన్న చెక్కిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ సినిమాలు తెలుగు జాతికి గర్వకారణం అయ్యాయి. ఇక ట్రిపుల్ ఆర్ అయితే ఏకంగా ఆస్కార్ లాంటి అవార్డు తెచ్చిపెట్టింది. మరి ప్రజెంట్ జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ ఈ స్క్రిప్ట్ వర్క్ తోనే బిజీ బిజీగా గడుపుతున్నాడు.
యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిలిం గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇది కాకుండా ఈయనకు మహాభారతాన్ని విజువల్ వండర్ గా తెరకెక్కించాలని కోరిక కూడా ఉందని అందరికి తెలుసు.. జక్కన్న ఈ విషయాన్నీ ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు. అయితే ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుంది అనే దానిపై స్పష్టత రాలేదు.

Mahabharat Project New Update
కానీ తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు.. మహేష్ సినిమా పూర్తి కాగానే మహాభారతం ఉంటుంది అని చెప్పుకొచ్చారు.. అలాగే ముందు ముందు ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అప్డేట్స్ ఉంటాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ స్టార్ తో పాటు పాన్ ఇండియన్ స్టార్స్ భాగం కానున్నారు.. అలాగే పార్టులుగా ఈ మూవీ రాబోతుందని ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి..