Madhuri Dixit : 53వ అంతస్తులో రూ.48 కోట్లతో సీనియర్‌ హీరోయిన్ డ్రీమ్‌ హౌస్‌

NQ Staff - October 6, 2022 / 08:54 AM IST

Madhuri Dixit : 53వ అంతస్తులో రూ.48 కోట్లతో సీనియర్‌ హీరోయిన్ డ్రీమ్‌ హౌస్‌

Madhuri Dixit : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ముంబైలోని లోయర్ పటేల్ ప్రాంతంలో అత్యంత విలాసమైన ఇంటిని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ఒక అతి పెద్ద అపార్ట్మెంట్లోని 53వ అంతస్తులు మాధురి దీక్షిత్ 48 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ ఇంటిని కొనుగోలు చేసిందట.

5384 చదరపు గజాల ఇంట్లో మాధురి దీక్షిత్ అతి త్వరలో అడుగు పెట్టబోతున్నారు. ఆమె కొత్త ఇంట్లో స్విమ్మింగ్ పూల్, ఫుట్బాల్ గ్రౌండ్‌, జిమ్, స్పా, క్లబ్ ఇలా ఎన్నో అద్భుతమైన వసతులు ఉన్నాయట.

అంతే కాకుండా అపార్ట్మెంట్ నుండి చూస్తే అరేబియా సముద్రం అద్భుతంగా కన్నుల విందు చేసే విధంగా వ్యూ ఉంటుందని బాలీవుడ్ వర్గాల వారు చెప్తున్నారు.

హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించిన మాధురి దీక్షిత్ ఈ మధ్య కాలంలో సినిమాలతో కాస్త తక్కువ అయినా.. సోషల్ మీడియా ద్వారా, టీవీ ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నా విషయం అందరికీ తెలిసిందే.

మాధురి దీక్షిత్ అందం ముందు ఇప్పటి హీరోయిన్ లు దిగదుడుపే అని కూడా చాలా మంది చాలా రకాలుగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి మాధురి దీక్షిత్ దాదాపు 50 కోట్ల రూపాయలు ఇల్లు కొనుగోలు చేయడంతో ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ గా మారింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us