Madhavan : సినిమా కోసం స్టార్ హీరో ఇల్లు అమ్ముకున్నాడా.. స్పంద‌న ఏంటంటే..!

NQ Staff - August 18, 2022 / 08:29 AM IST

Madhavan : సినిమా కోసం స్టార్ హీరో ఇల్లు అమ్ముకున్నాడా.. స్పంద‌న ఏంటంటే..!

Madhavan : త‌మిళ స్టార్ హీరో మాధ‌వ‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా సుప‌ర‌చిత‌మే. ఆయ‌న న‌టించిన ఎన్నో చిత్రాల‌ని తెలుగు ప్రేక్ష‌కులు స‌క్సెస్ చేశారు. ఇప్ప‌టికీ వైవిధ్య‌మైన సినిమాల‌తో అల‌రిస్తూనే ఉన్నాడు. తమిళ స్టార్ హీరో మాధవన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాకేట్రి’…ది నంబి ఎఫెక్ట్’ చిత్రం ఇటీవ‌ల‌ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో పాటు వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీలోకి కూడా వ‌చ్చేసింది.

Madhavan clarity about rocketry collections

Madhavan clarity about rocketry collections

అవ‌న్నీ అవాస్త‌వాలే..!

ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో సూర్య అతిథి పాత్రలో నటించారు. మరోవైపు హిందీ వెర్షన్‌లో షారుఖ్ ఆ పాత్రను చేయడం విశేషం. దేశ రాకేట్ ప్రయోగాలకు ఎంతగానో ఉపయోగపడే ఒక శాస్త్రవేత్తను అకారణంగా గూఢచర్యం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ శాస్త్ర‌వేత్త నేప‌థ్యంలో సినిమా చేశారు మాధ‌వ‌న్.

మాధవన్‌ రాకెట్రీ సినిమా బడ్జెట్‌ కోసం నిధులు సేకరించే క్రమంలో తన ఇంటినే అమ్మేశాడంటూ ఓ వార్త వైరల్‌ అవుతోంది. రాకెట్రీ సినిమాకు తొలుత మాధవన్‌ దర్శకుడు కాదని, ఓ ప్రముఖ డైరెక్టర్‌ ఈ సినిమాను చేయాల్సి ఉండగా అప్పటికే చేతిలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో రాకెట్రీ నుంచి తప్పుకున్నాడని, దీంతో మ్యాడీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడని సదరు కథనం పేర్కొంది. దీనిపై హీరో మాధవన్‌ స్పందించాడు..

నేనేదో గొప్ప త్యాగం చేశానని మీరు నన్ను ఆకాశానికి ఎత్తేయొద్దు. ఎందుకంటే నేను నా ఇల్లే కాదు, దేన్నీ కోల్పోలేదు. దేవుడి దయ వల్ల రాకెట్రీ సినిమాలో పాలుపంచుకున్న అందరూ ఈ ఏడాది ఎక్కువ ఆదాయపన్ను చెల్లించనున్నారు. అంత గొప్పగా, గర్వించదగ్గ లాభాలు వచ్చాయి. నేను ఇప్పటికీ నా ఇంటిని ప్రేమిస్తున్నాను, అదే ఇంట్లో నివసిస్తున్నాను కూడా!’ అని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు మ్యాడీ.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us