LOBO : ఎట్ట‌కేల‌కు చిరు సినిమాలో ఆఫ‌ర్ ద‌క్కించుకున్న లోబో.. ఇంత‌కు ఏ మూవీనో తెలుసా?

NQ Staff - December 9, 2021 / 01:35 PM IST

LOBO : ఎట్ట‌కేల‌కు చిరు సినిమాలో ఆఫ‌ర్ ద‌క్కించుకున్న లోబో.. ఇంత‌కు ఏ మూవీనో తెలుసా?

LOBO : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చిరు సినిమాలో ఆఫ‌ర్స్ భ‌లేగా ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే దివితో పాటు ప‌లువురికి ఛాన్స్ ఇచ్చిన చిరు ఇప్పుడు సీజ‌న్ 5లో పాల్గొన్న లోబోకి ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. ఇత‌ను ఒకప్పుడు స్టార్ మా మ్యూజిక్, స్టార్ మా చానెల్లో యాంకర్, హోస్ట్‌గా పని చేశాడు. ఇక ఇప్పుడు అదే లోబో బిగ్ బాస్ ఇంట్లో సందడి చేశారు.

బిగ్ బాస్ షోతో లోబోకు మాత్రం మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇటీవ‌ల లోబోకు సంబంధించిన విషయం ఒకటి ట్రెండ్ అయింది. ఆర్య 2 సినిమాలో లోబో ఉన్నాడంటూ ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. అప్పుడు అతను లోబో అని ఎవ్వరూ గుర్తు పట్టి ఉండరు. ఇప్పుడు చూసినా కూడా అది లోబో అని చెప్పలేరు. అప్పటి లోబోకు ఇప్పటి లోబోకు చాలా తేడా ఉంది.

lobo

lobo

ఆర్య తనకు ఐ లవ్యూ రాశాడు అని ఆఫీస్‌లో గీత హంగామా చేస్తుంది. బాస్ బ్రహ్మానందం ఆర్య దగ్గరికి వెళ్లి.. గీతకు నువ్ ఐ లవ్యూ రాశావా? అని అడుగుతాడు. అంటే ఏంటి సార్.. అని అనేస్తాడు. ఆ సీన్లో వెనకాల నిల్చునే వ్యక్తి లోబోనే. అయితే అది లోబో అని అప్పుడు జనాలకు అంతగా తెలిసి ఉండకపోవచ్చు

lobo acted in arya2

lobo acted in arya2

lobo

lobo

ఇటీవ‌ల ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో చిరంజీవి సినిమా ఆఫర్‌పై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ సినిమాలో నాది చిరుసార్‌ని అంటిపెట్టుకుని ఉండే పాత్ర. మెగాస్టార్‌ పక్కన నటించడం అంటే తన కల సాకారమైనట్లే’ అని సంబర పడిపోయాడు. దీంతో పాటు ఈ సినిమాకు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

LOBO

LOBO

మెగాస్టార్‌- మెహర్‌ రమేశ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘భోళా శంకర్‌’లోనే లోబో నటించనున్నాడని అర్థం చేసుకోవచ్చు. తమిళ ‘వేదాళం’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేశ్‌ చిరు సోదరిగా కనిపించనుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us