F3 Promo : పూజా హెగ్డే ఐటెం సాంగ్‌పై ఫుల్ క్లారిటీ.. లైఫ్ అంటే ఇట్టా ఉండాల‌ట‌..!

NQ Staff - May 16, 2022 / 02:29 PM IST

F3 Promo : పూజా హెగ్డే ఐటెం సాంగ్‌పై ఫుల్ క్లారిటీ.. లైఫ్ అంటే ఇట్టా ఉండాల‌ట‌..!

F3 Promo : ఒక‌వైపు స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న పూజా హెగ్డే స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌ర్తించేందుకు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. రంగ‌స్థ‌లం సినిమాలో అద‌ర‌గొట్టిన పూజా హెగ్డే ఇప్పుడు ఎఫ్ 3 చిత్రంలోను స్పెష‌ల్ సాంగ్‌తో అద‌ర‌గొట్ట‌నుంది. తాజాగా ఈ సినిమా నుంచి లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అనే సాంగ్ ప్రోమోను విడుదల చేసారు మేకర్స్. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ సాంగ్ లో వెంకీ – వరుణ్ పోటీ పడి మరీ స్టెప్స్ వేశారు.

ఈ ప్రోమోలో పూజా గ్లామర్ హైలైట్ గా ఉంది. ఎఫ్ 3లోనే అసలు సిసలైన స్పెషల్ సాంగ్ గా ఈ సాంగ్ రాబోతుంది. ఇక ఎఫ్ 2 కి సీక్వెల్ అంటేనే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. అందుకే మొదటి నుండి అనిల్ రావిపూడి ఈ సినిమా పై మరింత కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగా సినిమా తీశాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. తన ఎనర్జిటిక్ సాంగ్స్ తో సినిమా స్థాయిని పెంచుతున్నాడు దేవి.

దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో త‌మన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహ‌న్ న‌టిస్తున్నారు. గ్లామ‌ర్ డోస్ మాత్రం సినిమాకి ఫుల్‌గా ఉంటుంద‌ని అర్ద‌మ‌వుతుంది.

Life Ante Itta Vundaala Song Promo in F3

Life Ante Itta Vundaala Song Promo in F3

పూజా హెగ్గే కెరీర్ విషయానికి వస్తే.. గత రెండు నెలల్లో మూడు భారీ ప్రాజెక్టులు, ముగ్గురు అగ్ర హీరోలతో కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రభాస్‌తో రాధేశ్యామ్, విజయ్‌తో కలిసి బీస్ట్, రాంచరణ్‌తో కలిసి ఆచార్య చిత్రంలో నటించింది. అయితే ఈ మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి ఆదరణ, ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న హీరోయిన్ కావడంతో ఆమె గ్లామర్‌పై నిర్మాత, దర్శకులు పూర్తిగా ఆధారపడుతున్నారనే విషయం ఇటీవల కనిపిస్తున్న పరిణామాలతో స్పష్టమవుతున్నది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us