Bigg Boss House : బిగ్ బాస్ తెలుగు : కీర్తి కోసం వచ్చిన మహేష్ ఎవరు.?

NQ Staff - November 25, 2022 / 10:43 AM IST

Bigg Boss House : బిగ్ బాస్ తెలుగు : కీర్తి కోసం వచ్చిన మహేష్ ఎవరు.?

Bigg Boss House : బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్‌లో కీర్తి భట్ వెరీ వెరీ స్పెషల్ కంటెస్టెంట్. ఓ రోడ్డు ప్రమాదంలో తన కుటుంబాన్ని కోల్పోయినట్లు కీర్తి పలు సందర్భాల్లో చెప్పింది. బిగ్ బాస్ హౌస్ సాక్షిగా కూడా ఈ విషయమై కంటతడి పెడుతూ, తాను కుటుంబాన్ని కోల్పోయిన విషయం గురించి చెప్పుకొచ్చింది.

ఇప్పుడామెకి కుటుంబ సభ్యులనదగ్గరవారెవరూ లేరు. అయితే, ఓ చిన్నారిని దత్తత తీసుకుందని ప్రచారం జరుగుతోంది.

ఎవరీ మహేష్.?

కాగా, తాజా ఎపిసోడ్‌లో మహేష్ అనే వ్యక్తి ఒకరు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ల బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. హౌస్‌లోకి ఒకసారి ఎంట్రీ ఇస్తారు, హౌస్‌మేట్స్‌కి కొన్ని టిప్స్ చెబుతారు.. ఈ క్రమంలో హౌస్‌లో ఎమోషనల్ వాతావరణం చోటు చేసుకుంటుంది.

అలా హౌస్‌లోకి వచ్చిన మహేష్ ఎవరు.? కీర్తి భట్‌తో అతనికి వున్న సంబంధమేంటి..? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. కీర్తితో కలిసి ఓ సీరియస్‌లో నటించాడు మహేష్. ఆ సీరియల్‌లో శ్రీ సత్య కూడా నటించింది. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ కీర్తి – మహేష్ గురించి గతంలోనే వార్తలొచ్చాయ్.
మహేష్, కీర్తికి మంచి స్నేహితుడు. అంతకు మించి ఏమీ లేదుట.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us