Lata Mangeshkar : ల‌తా మంగేష్క‌ర్ హెల్త్ బులిటెన్ విడుద‌ల‌.. 12 రోజుల పాటు వైద్యుల ప‌రిశీల‌న‌లో..!

Lata Mangeshkar : వ‌రుస‌గా సినీ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్న వేళ లెజండ‌రీ సింగ‌ర్ ల‌తా మంగేష్క‌ర్‌కి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. ఆమెకు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలున్ప‌ప్ప‌టికీ వ‌య‌సు రీత్యా ఆమెను హాస్పిట‌ల్‌లో చేర్చామ‌ని, ద‌య‌చేసి మా గోప్య‌త‌ను గౌర‌వించాలంటూ ఆమె మేన కోడ‌లు ర‌చ‌న ట్వీట్ చేశారు. ల‌తా ఆరోగ్యంపై అభిమానులు ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో హెల్త్ బులిటెన్ విడుదలైంది.

Lata Mangeshkar
Lata Mangeshkar health update

ల‌తా మంగేష్కర్ ఆమె ఐసీయూలోనే ఉన్నార‌ని, 10-12 రోజుల పాటు వైద్యుల ప‌రిశీల‌న‌లోనే ఉంటార‌ని చెప్పారు. ఆమె కరోనాతో పాటు న్యూమోనియాతో బాధ‌ప‌డుతున్నార‌ని వైద్యుడు ప్ర‌తీత్ సంధాని తెలిపారు. కాగా, మూడు రోజుల క్రితం ఆమెకు క‌రోనా నిర్ధార‌ణ అయింది. ల‌తా మంగేష్క‌ర్ 2019లోనూ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుని కోలుకున్నారు.

2019లోనూ శ్వాస సంబంధిత స‌మస్య‌ల‌తో ల‌తా మంగేష్క‌ర్ హాస్పిట‌ల్లో జాయిన్ అయ్యారు. ఇండియ‌న్ నైటింగేల్‌గా పేరున్న గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ త‌న గాత్రంతో యావ‌త్ సినీ లోకాన్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు. ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ద్మ భూష‌ణ్, దాదాసాహెబ్ ఫాల్కే స‌హా ఎన్నో అవార్డులను ఆమె అందుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 50 వేల‌కు పైగానే ఆమె పాట‌లు పాడారు.

1948 నుంచి 1978 వరకు 50వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు లతాజీ. ఈమె గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు. 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న, వంటి పురాస్కారాలతో భారత ప్రభుత్వం లతా మంగేష్కర్‌ను సత్కరించింది.

ఈసారి సినీ ప్ర‌ముఖులు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా మ‌న తెలుగు సినీ ఇండ‌స్ట్రీ విష‌యానికి వ‌చ్చేస‌రికి ఈసారి తెలుగు సినీ స్టార్స్ చాలా మంది కరోనా బారిన ప‌డ్డారు. మ‌హేష్ బాబు, మంచు మ‌నోజ్‌, విశ్వ‌క్ సేన్‌, మంచు ల‌క్ష్మి, రాజేంద్ర ప్ర‌సాద్ త‌దిత‌రులు క‌రోనా ప్ర‌భావంతో ఐసోలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇక స‌త్య‌రాజ్‌, ఖుష్బూ, మీనా, శోభ‌న వంటి వారు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు