Lata Mangeshkar : హెల్త్ బులిటెన్ విడుద‌ల‌.. లతా మంగేష్క‌ర్ ఆరోగ్యం ఇప్పుడెలా ఉందో తెలుసా?

Lata Mangeshkar : దేశం గ‌ర్వించ‌ద‌గ్గ సింగ‌ర్స్ లో లతా మంగేష్క‌ర్ త‌ప్ప‌క ఉంటారు. అన్ని భాష‌ల‌లో పాట‌లు పాడి అల‌రించిన లతా మంగేష్క‌ర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్‌ మేనకోడలు రచనా ద్రువీకరించారు. లతాదీకి స్వల్ప లక్షణాలతో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని, అయితే, వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచారని రచన పేర్కొన్నారు.

Lata Mangeshkar health condition
Lata Mangeshkar health condition

ల‌తా క‌రోనా బారిన ప‌డిన‌ప్ప‌టి నుండి ఆమె అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు వైద్యులు. లతా మంగేష్కర్‌ ఇంకా ఐసీయూలోనే ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

స్వల్పంగా కోలుకున్నారని లతా మంగేష్కర్‏కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ స్పష్టం చేశారు. తన పాటలతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న లతా మంగేష్కర్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. 2019లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్‌ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

1929,సెప్టెంబర​28న జన్మించిన లతా మంగేష్కర్ భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మవిభూషణ్, సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇండియన్‌ నైటింగల్‌గా పేరు సంపాదించిన ఆమె ఇప్పటివరకు 50వేలకు పైగా పాటలు పాడారు.

తెలుగులో ఆమె కేవలం మూడు పాటలే పాడటం మన దురదృష్టం. తెలుగులో ఆమె ఎక్కువ పాటలు పాడకపోవడానికి కారణం ఆమెకే తెలియాలి. 1955లో వచ్చిన ‘సంతానం’ సినిమాలోని ‘నిదురపోరా తమ్ముడా’, ‘దొరికితే దొంగలు’ సినిమాలోని ‘శ్రీ వేంకటేశా..’, 1988లో వచ్చిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్లచీరకు’ పాటలు ఆలపించారు.