Lasya Manjunath : ఛీ పాడు.! సిగ్గులేదా అంటూ యాంకర్ లాస్యను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటజనం.!
NQ Staff - December 27, 2022 / 12:13 PM IST

Lasya Manjunath : తన చలాకీ తనంతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న బుల్లితెర ముద్దుగుమ్మ లాస్య. యాంకర్‌గా చీమ ఏనుగు కుళ్లి జోకులతో ఫేమస్ అయ్యింది లాస్య.
బిగ్‌బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. మంజునాధ అను సాఫ్ట్వేర్ వుద్యోగిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకి తల్లి కూడా అయ్యింది యాంకర్ లాస్య.
పర్సనల్ని మరీ ఇంత పబ్లిక్ చేస్తావా.?
తాజాగా ఆమె రెండోసారి గర్భవతి అయ్యానంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ పోస్ట్ ఇప్పుడు లాస్యను నెటిజన్ల ట్రోల్స్‌కి గురయ్యేలా చేసింది.
అదేంటీ.! ప్రెగ్నెంట్ అయితే, నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తారు.? అనేదే కదా మీ అనుమానం. అయితే, పోస్ట్‌లోని అసలు సంగతి మీకు తెలియాల్సిందే. పీరియడ్స్ వల్ల వచ్చే పెయిన్‌ని తగ్గించమంటే, మంజునాధ నన్ను మళ్లీ ప్రెగ్నెంట్‌ని చేశాడు అని పోస్ట్ చేసింది లాస్య.
పీరియడ్స్ పెయిన్‌ని తగ్గించమంటే, అయితే సరే.. తొమ్మిది నెలలు నీకు ఆ బాధ తగ్గిస్తానని అన్నాడట (ప్రెగ్నెన్సీతో). ఇది ఎంత పర్సనల్ విషయం.! ఇలాంటి విషయాల్ని కూడా పబ్లిక్ చేస్తావా.? నీకు సిగ్గు లేదా.? అంటూ లాస్యను లెఫ్ట్ అండ్ రైట్ ఆడేసుకుంటున్నారు నెటిజనం.
అలాగే సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ అయినందుకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు మరికొంతమంది లాస్య అభిమానులు.