Kriti Sanon And Mahesh Babu : మహేష్ అందుకే అంత స్పెషల్: కృతి సనన్

NQ Staff - November 19, 2022 / 09:45 PM IST

Kriti Sanon And Mahesh Babu : మహేష్ అందుకే అంత స్పెషల్: కృతి సనన్

Kriti Sanon And Mahesh Babu : తన తాజా సినిమా ప్రమోషన్ కోసం హైద్రాబాద్ వచ్చిన పొడుగు కాళ్ళ సుందరి కృతి సనన్, తన తొలి సినిమా హీరో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు గురించి చాలా చాలా ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది.

తెలుగులో మహేష్ సరసన కృతిసనన్ ‘1 నేనొక్కడనే’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్యతో ‘దోచెయ్’ అనే సినిమాలోనూ నటించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు ఈ బ్యూటీ.

తొలి సినిమా.. వెరీ వెరీ స్పెషల్..

తెలుగులో తొలి సినిమా.. తొలి హీరో.. ఇవి తనకెప్పుడూ వెరీ వెరీ స్పెషల్ అంటున్న కృతి సనన్, అనివార్య కారణాల వల్ల ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేకపోయాననీ, ఇకపై రెగ్యులర్‌గా తెలుగులోనూ సినిమాలు చేస్తానని చెప్పింది.

‘నేను తొలి తెలుగు సినిమా చేసేటప్పుడు నాకు తెలుగు రాదు. కానీ, ఆ లోటు తెలియనివ్వలేదు మహేష్. ఓ స్టార్ అయి వుండీ, డౌన్ టు ఎర్త్‌ అన్నట్టుగా మహేష్ వుండేవారు. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. షూటింగ్ సమయంలో పలు అంశాలపై ఇద్దరం చర్చించుకునేవాళ్ళం.

హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్స్ ఐ మెట్..’ అంటూ కృతి సనన్ వ్యాఖ్యానించింది.
‘బేడియా’ సినిమా తెలుగులో ‘తోడేలు’ పేరుతో విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసమే హైద్రాబాద్ వచ్చింది కృతి సనన్.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us