Kriti Sanon : సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘1 – నేనొక్కడినే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన అందాల భామ కృతి సనన్. టైటిల్‌లో వున్న నెంబర్ వన్ అమ్మడి కెరీర్‌లో లేకపాయె. ఫస్ట్ సినిమానే బోల్తా కొట్టే.. తర్వాత నాగ చైతన్యతో ‘దోచేయ్’ అనే సినిమాలో నటించింది. దాని అడ్రస్సూ గల్లంతే. దాంతో తెలుగులో మరో అవకాశం కోసం ఎదురు చూడలేదు కృతిసనన్.

దుకాణం బాలీవుడ్‌కి సర్దేసింది. అక్కడ మొదట్లో కాస్త ఇబ్బందులు పడినా, ఆ తర్వాత నిలదొక్కుకుంది. క్రేజీ ఆఫర్లు కృతి సనన్ చేతికి చిక్కాయ్. ఆమెలోని నటికి ఛాలెంజ్ విసిరే పాత్రలు కావడంతో, హీరోయిన్‌గా క్లిక్ అయ్యింది బాలీవుడ్‌లో.

టాలీవుడ్ రీ ఎంట్రీ ఈ సారి ఎంతో ఘనంగా..
స్టార్ హోదా కూడా ఇప్పుడు ఆమె సొంతం. మళ్లీ ఇన్నాళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది కృతి సనన్. అదీ ఓ ప్యాన్ ఇండియా సినిమాతో. ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ సరసన ‘ఆది పురుష్’లో నటిస్తోంది కృతి సనన్.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక గాధ ఆధారంగా రూపొదుతోన్న ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్ర పోషిస్తున్నట్లు ఎప్పుడో హింట్ ఇచ్చారు. ఇక సినిమాల సంగతి అటుంచితే, సోషల్ మీడియాలో కృతి సనన్ హాట్ అలర్ట్ మామూలుగా వుండదు.
- Advertisement -

తాజాగా పింక్ కలర్ పొట్టి డ్రస్‌లో కృతి సనన్ అందాలు సోషల్ మీడియాని కేక పుట్టిస్తున్నాయ్. అసలే మాంచి పొడుగరి ఈ ముద్దుగుమ్మ. ఇక, మోకాలి పై వరకూ డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్‌లో కృతి సనన్ థై షో కుర్రకారులో కాక రేపేస్తోంది.