Kriti Sanon : ఎవరి గుండెల్లో దేవతగా కృతి సనన్ కొలువై వుంది.? వరుణ్ ధావన్ అదే చెప్పాడా.?

NQ Staff - November 27, 2022 / 09:20 PM IST

Kriti Sanon : ఎవరి గుండెల్లో దేవతగా కృతి సనన్ కొలువై వుంది.? వరుణ్ ధావన్ అదే చెప్పాడా.?

Kriti Sanon : కాఫీ విత్ కరణ్.. ఈ షోలో సెలబ్రిటీల మనసుల్లోకి తొంగి చూస్తుంటాడు బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్. తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతుంటాడు.. ఒక్కోసారి మితిమీరిన శృంగార భరితమైన వ్యవహారాల గురించి కూడా కూపీ లాగుతాడు. కొన్ని సందర్భాల్లో అయితే, మరీ దారుణంగా వుంటాయ్ ఈ ‘షో’లోని మాటలు.

అసలు విషయమేంటంటే, బాలీవుడ్ నటి కృతి సనన్ ఓ వ్యక్తి గుండెల్లో దేవతలా కొలువు దీరిందట. ఆ వ్యక్తి గురించి బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌కి బాగా తెలుసట.

ప్రభాస్.. ప్రభాస్ ప్రభాస్.. అంతేనా.?

కృతి సనన్ ఎప్పుడూ తన ప్రేమ గురించి ఎక్కడా చెప్పింది లేదు. కానీ, కృతి సనన్ ఓ హ్యాండ్సమ్ హంక్‌తో ప్రేమలో పడిందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ హ్యాండ్సమ్ హంక్ ఎవరో కాదు, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.

‘ఆ వ్యక్తి ముంబైకి చెందినవాడు కాదు.. ప్రస్తుతం దీపికా పడుకొనేతో ఓ సినిమా చేస్తున్నాడు..’ అంటూ వరుణ్ ధావన్, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు కృతి సనన్ గురించి.

దీపికతో ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి, ఈ విషయమై ప్రభాస్ స్పందిస్తాడా.? కృతి సనన్ ఏమంటుంది.?
అన్నట్టు కృతి ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us