Krithy Shetty : ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరపైకి నిజంగానే అందాల ఉప్పెనలా దూసుకొచ్చింది కృతి శెట్టి. తొలి తెలుగు సినిమాతోనే, అటు సినీ జనాల్నీ, ఇటు ప్రేక్షకుల్నీ తనదైన నటనతో, తనదైన అందంతో కట్టిపడేసింది. ‘బేబమ్మ’గా ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు.

సినిమా సినిమాకీ అటు గ్లామరునీ, ఇటు ఫేమ్‌నీ పెంచుకుంటూ పోతోన్న కృతి శెట్టి, ఏ సినిమాలో నటించినా.. ఆ సినిమాలో డాన్సులతో అదరగొట్టేస్తోంది. ప్రస్తుతం తన తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రమోషన్లలో బిజీగా వుంది కృతి శెట్టి.
క్యూటీ థండరూ..
తాజాగా ఈ సినిమా నుంచి ‘క్యూటీ థండరూ..’ అంటూ సాగే పాటను విడుదల చేయబోతోంది చిత్ర యూనిట్. దీనికి సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు. ఫుల్లీ కవర్డ్.. అయినా, సూపర్ హాట్.. అనేంతలా కృతి శెట్టి అందాల విధ్వంసమే సృష్టించేస్తోంది.
డాన్సుల్లో నితిన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? కృతి శెట్టి సంగతి సరే సరి. ఇద్దరూ కలిసి డాన్స్ ఈ పాటలోనూ ఇరగదీసేసే వుంటారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్టు 12న ఈ ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ కాగా, వాటన్నిటినీ మించి ‘క్యూటీ థండరూ..’ అదరగొట్టేస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.